మహిళల ఆర్థిక సాధికారతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి :మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు కొంగొత్త ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శక్తి పై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వనపర్తి జిల్లాలోని స్వయం సహాయ మహిళా సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు సేవా రంగంలో పనిచేసే విధంగా కొత్త కొత్త వ్యాపారాల ఆకాశాలు కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిని ఆదేశించారు. పట్టణంలో క్యాంటీన్ ఏర్పాటు, పిజా హట్, మహిళలకు మోడ్రన్ జిమ్, స్పోర్ట్స్ షాప్, బ్యూటీ పార్లర్ హబ్ వంటివి నెలకొల్పేవిధంగా ఆసక్తిని కలిగించి అందుకు అవసరమైన అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పించాలని సూచించారు. వనపర్తి పట్టణంలో మహిళా సాధికారతకు చాల అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి, డి.పి.యం అరుణ, అడిషనల్ డి.ఆర్.డి. ఒ భీమయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : మహిళల ఆర్థిక సాధికారతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి)