Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ వర్గీకరణ చట్ట రూపశిల్పి ముఖ్యమంత్రి చంద్రబాబు

ఎస్సీ వర్గీకరణ చట్ట రూపశిల్పి ముఖ్యమంత్రి చంద్రబాబు

0

ఎస్సీ వర్గీకరణ చట్ట రూపశిల్పి ముఖ్యమంత్రి చంద్రబాబు

మంద కృష్ణ మాదిగ

న్యూస్ తెలుగు /ములుగు, హైదరాబాద్ : ఎస్సి వర్గీకరణ చట్ట రూప శిల్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ను, ఎమార్పి్స్ అధినేత మంద కృష్ణ మాదిగ,కలిసి కృతజ్ఞతలు తెలిపారు.మంద కృష్ణ మాదిగ
మడమ తిప్పని పోరాటంతో విజయం సాధించావని మంద కృష్ణ మాదిగ ను చంద్రబాబు నాయుడు అభినందించారు నాయుడు.
హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ని వారి నివాసంలో ఎమ్మార్పీఎస్ అదినేత శ్రీ మంద కృష్ణ మాదిగ కలిశారు.
సుప్రీం కోర్టు తీర్పు ద్వారా ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన,ఉద్యమం విజయాన్ని ముద్దాడిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చట్టానికి పురుడుపోసి ఆయుధంగా మలిచిన చంద్రబాబు నాయుడు కు మంద కృష్ణ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు కు శాలువా కప్పి పుష్ప గుచ్చo అందించి మంద కృష్ణ మాదిగ శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు నాయుడు చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టమే సుప్రీం కోర్టు న్యాయ విచారణలో విజయం సాధించిందని మంద కృష్ణ మాదిగ తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ మొదటి అమలు చేసింది చంద్రబాబు గారే,అలాగే ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ద్వారా విజయం సాధించిన తరువాత అమలు జరగాల్సిన సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉండడం శుభ పరిణామమని అన్నారు.
త్వరగా ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకు రావాలని కోరారు.
ముప్ఫై ఏళ్ళు మడమ తిప్పకుండా గట్టిగా పోరాడడం వల్లే విజయం సాధ్యమైందని మంద కృష్ణ మాదిగ గారిని చంద్రబాబు నాయుడు అభినందించారు.
ఈ సందర్బంగా మంద కృష్ణ మాదిగ కు చంద్రబాబు నాయుడు శాలువా కప్పి, పుష్ప గుచ్ఛం అందించి అభినందించారు. (Story : ఎస్సీ వర్గీకరణ చట్ట రూపశిల్పి ముఖ్యమంత్రి చంద్రబాబు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version