‘ప్రాజెక్ట్ ఆశ్రయ్’ని ప్రారంభించిన అమెజాన్ ఇండియా
న్యూస్‌తెలుగు/బెంగళూరు: డెలివరీ అసోసియేట్‌ల ఆరోగ్యంకు మద్దతివ్వాలనే తమ అచంచలమైన నిబద్ధతలో భాగంగా, అమెజాన్ ఇండియా ‘ప్రాజెక్ట్ ఆశ్రయ్’ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా, మొత్తం లాజిస్టిక్ పరిశ్రమలోని డ్రైవర్లు ఢల్లీి ఎన్ సి ఆర్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోని వ్యూహాత్మక ప్రదేశాలలో విశ్రాంతి-పాయింట్‌లను వినియోగించుకునే అవకాశం పొందుతారు. ఉద్యాస ఫౌండేషన్ సహకారంతో, తొలుత పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు ఆశ్రయ్ కేంద్రాలను అధిక ఫుట్‌ఫాల్ ప్రదేశాలలో ఏర్పాటు చేయనుంది. మొదటి ఆశ్రయ్ కేంద్రాన్ని బౌలేవార్డ్, మాలిబు టౌన్, సెక్టార్ 47, గురుగ్రామ్ వద్ద అంతర్జాతీయ కార్మిక సంస్థలో కంట్రీ డైరెక్టర్ – ఇండియా మిచికో మియామోటో ప్రారంభించారు. ‘‘అమెజాన్ వద్ద , డెలివరీ అసోసియేట్‌లకు ఆన్-రోడ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, పరిశ్రమలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలను అందించటానికి, ఉత్తమ పద్ధతులను నిర్వహించడానికి మేము కట్టుబడి ఉన్నామని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ అన్నారు. (Story : ‘ప్రాజెక్ట్ ఆశ్రయ్’ని ప్రారంభించిన అమెజాన్ ఇండియా )