25 నుంచి జీ తెలుగులో ఆదివారమూ సీరియల్స్
న్యూస్‌తెలుగు/ ఖమ్మం: జీ తెలుగులో ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్‌ని ఇక నుంచి ఆదివారం కూడా ప్రసారం చేయాలని సిద్ధమైందనీ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ ఈ నెల 25 నుంచి ఆదివారం కూడా ప్రసారం అవుతాయన్నారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, మా అన్నయ్య, నిండు నూరెళ్ళ సావాసం, మేఘసందేశం, పడమటి సంధ్యారాగం, త్రినయని సీరియల్స్ ఇకనుంచి ఆదివారం కూడా తమ అభిమానులను అలరిస్తాయన్నారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సాయంత్రం 6 గంటలకు, మా అన్నయ్య 6:30 గంటలకు, నిండు నూరేళ్ళ సావాసం రాత్రి 7 గంటలకు, మేఘసందేశం 7:30 గంటలకు, పడమటి సంధ్యారాగం 8 గంటలకు, త్రినయని 8:30 గంటలకు ప్రసారం కానున్నాయన్నారు. మధ్యాహ్నం సీరియల్స్ మాత్రం యథాతథంగా సోమవారం నుంచి శనివారం వరకు వాటి సమయాల్లో ప్రసారమై ప్రేక్షకులను అలరిస్తాయన్నారు.ఈ నాన్ స్టాప్ సీరియల్ ట్రీట్‌తో పాటు ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బ్లాక్ బస్టర్ హిట్ పిండం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను కూడా అందిస్తోందన్నారు. (Story : 25 నుంచి జీ తెలుగులో ఆదివారమూ సీరియల్స్)