షిరిడి సాయిబాబా కు పాలాభిషేకం
న్యూస్‌తెలుగు/విజయనగరం : పట్టణంలో ధర్మపురి రోడ్డు వద్ద ఉన్న అవధూత దత్త సాయి సమర్థపీఠంలో గురువారం పురస్కరించుకొని షిరిడి సాయిబాబా ఉత్సవ విగ్రహానికి సాయి సుందర మహారాజ్ ఆధ్వర్యంలో రామకృష్ణ శర్మ, సాయిరాజ్ శర్మ భక్తులచే పాలాభిషేకాన్ని నిర్వహించి పుష్పాలంకరణ చేశారు. ఈ సందర్భంగా సాయి సుందర మహారాజ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే షిరిడి సాయిబాబా దేవాలయాల్లో మొదటి దేవాలయంగా అవధూత దత్త సాయి సమర్థపీఠం వెలిసిందన్నారు. ఈ దేవాలయంలో ప్రతి గురువారం ఉదయం 6 గంటల నుండి 9:30 వరకు ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకం, సాయంత్రం భజన కార్యక్రమంతో పాటు ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. గురు పౌర్ణమి, దసరా, శ్రీరామనవమి పర్వదినాలలో భక్తులతో షిరిడి సాయి నాధుని మూలవిరాట్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి ఆదివారం దేవాలయంలో ఉన్న సిద్ధిరాజ దత్తాత్రేయ స్వామికి తైలాభిషేకం జరుగుతుందన్నారు. (Story : షిరిడి సాయిబాబా కు పాలాభిషేకం)