UA-35385725-1 UA-35385725-1

క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేసేందుకే అవగాహన కార్యక్రమాలు

క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేసేందుకే అవగాహన కార్యక్రమాలు

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

న్యూస్‌తెలుగు/ విజయనగరం : జిల్లాలోని మారుమూల గ్రామాలను కూడా సందర్శించి, ప్రజలతో పోలీసులు మమేకం కావాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులు, సిబ్బందిని ఇప్పటికే ఆదేశించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. తమ ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసు అధికారుల, సిబ్బంది తమ పోలీసు స్టేషను పరిధిలోని గ్రామాలను విధిగా సందర్శిస్తున్నారని. స్థానిక ప్రజలు, నాయకులతో మమేకమై గ్రామాల్లోని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో సమస్యలను సృష్టించేందుకు అవకాశం ఉన్న వాటిని క్షేత్ర స్థాయిలోనే గుర్తించి, వాటిని ప్రాధమిక స్థాయిలోనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారని క్షేత్ర స్థాయిలో సమస్యలను గుర్తించేందుకు మహిళా సంరక్షణ పోలీసుల సహకారంను తీసుకుంటూ, వాటి పరిష్కారంపై శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. అంతేకాకుండా, గ్రామ స్థాయిలో గ్రామసభలు నిర్వహించి, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ, వారికి అనేక రకాలైన చట్టాలు, భద్రత పట్ల, కొత్త తరహా నేరాలు, వాటిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పట్ల అవగాహన కల్పిస్తున్నారు. నేరాలు జరిగితే, ప్రజలు వ్యవహరించాల్సిన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు గురించి వివరిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా వివిధ రకాలైన సైబరు మోసాలు, రహదారి భద్రత, మహిళల భద్రత, కొత్త చట్టాలు, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను ప్రజలకు వివరిస్తున్నారని. మహిళల భద్రతకు వారు అవలంభించాల్సిన తీరు, పోలీసుల సహాయం ఏవిధంగా పొందవచ్చునో మహిళలకు వివరించి, వారికి రక్షణగా నిలిచే చట్టాలు పట్ల అవగాహన కల్పించారన్నారు. అదే విధంగా సైబరు మోసాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలను ప్రజలకు వివరిస్తూ అపరిచిత వ్యక్తులు పంపే లింకులు, సందేశాలకు స్పందించవద్దని కోరుతున్నామన్నారు ఇంటి వద్దనే ఉండి గృహిణులు ఉద్యోగాలు చేసుకోవచ్చునని, ఆర్థికంగా బలపడవచ్చుననే చెప్పే మోసాగాళ్ళ మాటలను నమ్మవద్దని . ఎవరైనా సైబరు మోసానికి గురైతే వెంటనే 1930కు లేదా నేషనల్ సైబర్ క్రైం పోర్టల్ నందు ఫిర్యాదు చేయాలన్నారు. అదే విధంగా మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు ఏవిధంగా నాశనం అవుతాయో వివరించి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, కళాశాలలు, స్కూల్స్ పోలీసు అధికారులు ను సందర్శించి, విద్యార్థులకు డ్రగ్స్ కు అలవాటు పడవద్దని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అన్నారు. రహదారి భద్రతకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని, రహదారి భద్రత నియమాలు పాటించాలని, డ్రైవింగు లైసెన్సులు లేకుండా వాహనాలు నడపవద్దని, మైనర్లుకు వాహనాలు ఇవ్వొద్దని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112కు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. (Story : క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేసేందుకే అవగాహన కార్యక్రమాలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1