Homeవార్తలు ‘ముఫాసా’కి వాయిస్ ఓవర్ ఇస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు

 ‘ముఫాసా’కి వాయిస్ ఓవర్ ఇస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు

 ‘ముఫాసా’కి వాయిస్ ఓవర్ ఇస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు

బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20, 2024న భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.

అల్టిమేట్ జింగిల్ కింగ్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ లెగసిని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది. 2019లో  లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ, విజువల్‌గా అద్భుతమైన లైవ్ యాక్షన్ ముఫాసా: ది లయన్ కింగ్ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు. ఆయనతో  ప్రముఖ నటులు బ్రహ్మానందం పుంబాగా అలీ టిమోన్‌గా తిరిగి వస్తున్నారు. ఆగస్టు 26న ఉదయం 11.07 గంటలకు తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

ఈ అద్భుతమైన అసోసియేషన్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ“డిస్నీ బ్లాక్‌బస్టర్ లెగసీ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, టైమ్‌లెస్ స్టోరీ టెల్లింగ్‌ నాకెంతో ఇష్టం, ముఫాసా పాత్ర తన కొడుకును నడిపించే ప్రేమగల తండ్రిగా మాత్రమే కాకుండా అడవికి రారాజు.  డిస్నీతో ఈ అసోసియేషన్  వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది, ఇది నా పిల్లలతో నేను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్. డిసెంబర్ 20న తెలుగులో బిగ్ స్క్రీన్‌పై ముఫాసా: ది లయన్‌ కింగ్‌ను నా కుటుంబంతో పాటు నా అభిమానులు చూస్తారని ఎదురు చూస్తున్నాను’ అన్నారు.

“కథా కథనానికి మరింత పర్శనల్ టచ్ తీసుకురావడం,  దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పరస్పర చర్చ జరపడం, వారు తమ కుటుంబ సభ్యులతో తమకు నచ్చిన భాషలో సినిమాని ఎక్స్ పీరియన్స్ చేయడం మా లక్ష్యం. ముఫాసాఐకానిక్ క్యారెక్టర్ తరాలకు స్ఫూర్తినిచ్చింది. ముఫాసా: ది లయన్ కింగ్ తెలుగు వెర్షన్‌లో మహేష్ బాబు గారు ముఫాసా వాయిస్‌కి జీవం పోయడం మాకు చాలా ఆనందంగా ఉంది! అని డిస్నీ స్టార్ స్టూడియోస్ హెడ్ బిక్రమ్ దుగ్గల్ అన్నారు.

దర్శకుడు – బారీ జెంకిన్స్; ఒరిజినల్ సాంగ్స్ : లిన్-మాన్యుయెల్ మిరాండా
ఇంగ్లీష్ వాయిసెస్: ఆరోన్ పియర్ (ముఫాసా), కెల్విన్ హారిసన్ జూనియర్ (టాకా), టిఫనీ బూన్ (సరబి), కగిసో లెడిగా (యంగ్ రఫీకి), ప్రెస్టన్ నైమాన్ (జాజు), మాడ్స్ మిక్కెల్‌సెన్ (కిరోస్), థాండీవే న్యూటన్ (ఈషే), లెన్నీ జేమ్స్ (ఒబాసి), అనికా నోని రోజ్ (ఆఫియా), కీత్ డేవిడ్ (మాసెగో), జాన్ కాని (రఫీకి), సేథ్ రోజెన్ (పుంబా), బిల్లీ ఐచ్నర్ (టిమోన్), డోనాల్డ్ గ్లోవర్ (సింబా), బ్లూ ఐవీ కార్టర్ (కియారా), బ్రెలిన్ రాంకిన్స్ (యంగ్ ముఫాసా), థియో సోమోలు (యంగ్ టాకా), ఫోలేక్ ఒలోవోఫోయెకు, జోవన్నా జోన్స్, తుసో ఎంబెడు, షీలా అటిమ్, అబ్దుల్ సాలిస్, డొమినిక్ జెన్నింగ్స్ , బియాన్స్ నోలెస్-కార్టర్ (నాలా).

ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20, 2024న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగులో ఇండియన్ థియేటర్లలో విడుదల కానుంది. (Story :  ‘ముఫాసా’కి వాయిస్ ఓవర్ ఇస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!