ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.
న్యూస్‌తెలుగు/ ములుగు : భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. అధికారులను ఆదేశించారు.
బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన కొరకు ఏర్పాటు చేసిన బృందాలతో కలెక్టర్ దివాకర టి. ఎస్., అదనపు కలెక్టర్లు పి. శ్రీజ, సి.హెచ్. మహేందర్ జి లతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని, ముందుగా అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సర్వే నెంబర్లు, ప్లాట్ అప్లికేషన్ల సంఖ్య, రోడ్డు విస్తీర్ణం, ఇనాం భూమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తులు కు డాక్యుమెంట్లు, ఫ్లాట్ ఇమేజెస్, మాస్టర్ ప్లాన్ జత చేసి ఉండాలన్నారు. ఆ స్థలం ప్రభుత్వాన్నిదా, సికం భూమి, ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నదా అని పరిశీలించాలని సూచించారు. బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లేటప్పుడు గ్రామాల వారీగా, సర్వే నెంబర్ల ప్రకారం వెళ్తే పని సులభం అవుతుందని తెలిపారు. బృందంలోని సభ్యులందరూ లాగిన్ అయ్యే విధంగా చూడాలన్నారు. మీకు కేటాయించిన మండలానికి సంబంధించిన అప్లికేషన్ లు మాత్రమే పరిశీలించాలి అని అన్నారు.
బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లే ముందు షెడ్యూల్ తయారు చేసుకోవాలని ఆ షెడ్యూల్ ప్రకారం ఆ దరఖాస్తుదారిది ఏ గ్రామం, ఎప్పుడు వెళ్ళేది తెలుసుకొని దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చి వెళ్లాలని అన్నారు. అలా చేయడంవల్ల ఎవరైనా డాక్యుమెంట్లు జత చేయనట్లయితే వారిని అడిగి జత చేయవచ్చన్నారు.
తేది.26.8.2020 కంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎల్ ఆర్ ఎస్ ఆన్లైన్లో దరకాస్తూ చేసుకొన్న డాకుమెంట్స్ దరఖాస్తుల స్క్రుటిని ప్రక్రియ జరుగుతున్నదని అన్నారు.
4980 ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి, క్షేత్ర స్థాయిలో పరిశీలనకు 19 బృందాలను బృందానికి ముగ్గురు చొప్పున నియమించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా చేయాలని, ఎలాంటి పొరపాటు లేకుండా దరఖాస్తులు అప్లోడ్ చేయాలని సూచించారు. పట్టా ఉన్నవారు మాస్టర్ ప్లాన్ లో ఉన్న వారి దరఖాస్తులను సులభంగా నమోదు చేయవచ్చని, ప్రతి టిం ప్రతి రోజూ 35 దరఖాస్తులు సంపూర్ణంగా ఉన్న దరఖాస్తులను అప్లోడ్ చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కే. సత్య పాల్ రెడ్డి, డి పి ఓ ఇంచార్జీ సంపత్ రావు, జిల్లా ఇర్రిగేషన్ అధికారి అప్పలనాయుడు, ములుగు తహసిల్దార్ విజయ భాస్కర్, ఇర్రిగేషన్ ఏ ఈ లు, ఆర్ ఐ లు, పంచాయితి సేక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు. (Story : ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి)