‘ఎస్‌ఐ కోదండపాణి’ సూపర్‌హిట్ ఖాయం
హీరోగా మక్కా శ్రీను, హీరోయిన్‌గా సుచిత్ర రాధోడ్ నూతన పరిచయంతో నిర్మితమైన సినిమా ‘ఎస్‌ఐ కోదండపాణి’. శ్రీ సాయి హనుమాన్ మూవీ పతకాంపై మక్కా శ్రీదేవి నిర్మిస్తున్నారు. దిల్ రమేష్, ఏజీఎం శ్రీనివాస్, సూరినాయుడు, టిక్ టాక్ సూరిబాబు, స్వర్ణ (జూనియర్ తెలంగాణా శకుంతల), షరీఫ్, నాగు, రమేష్, మణికంఠ, నందిని, దివ్య, అనూష, నాగేంద్ర రెంటాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్టు 30న విడుదలకు సిద్ధమైంది. నూతన దర్శకుడు రెంటాల నాగేంద్ర ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ సబరి, సంగీతం సాల్మన్, ఫైట్స్ కోడి రాము, అభి, ఆర్ట్ డైరెక్టర్ రమేష్, ఎడిటర్ ఉదరుగా వ్యవహరిస్తున్నారు. హీరో, హీరోయిన్లు మక్కా శ్రీను, సుచిత్ర రాథోడ్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్యాయాలను ఎదిరించే పోలీసు పాత్రలో తాను ఎంతో కష్టపడి నటించానన్నారు. సినిమాలో విషయం ఉంటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. తమతోపాటుగా మిగతా తారాగణం అంతా ఎంతో చక్కగా నటించారన్నారు. పోలీసు కథాంశంగా కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశామన్నారు. ముగ్గురు స్నేహితులు తమకు సంబంధంలేని హత్య కేసులో ఇరుక్కుని మళ్లీ ఎలా బయటపడ్డారనే ఇతివృత్తంగా కథ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్‌గా కొనసాగుతుందన్నారు. దర్శకత్వం రెంటా నాగేంద్ర వహించారు. కెమెరా సబరి, సంగీతం సాల్మన్‌రాజు, ఫైట్స్ కోడి రాము, అభి, ఆర్ట్ డైరెక్టర్ రమేష్ ఎడిటర్‌గా ఉదరు వ్యవహరించారు. 150 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. తమ సినిమా ఖచ్చితంగా సూపర్‌హిట్‌మూవీగా నిలుస్తుందని చిత్రబృందం వెల్లడించింది. క్లాస్, మాస్ ఎలిమెంట్లతో తెరకెక్కించాం’ప్రస్తుతం రొటీన్ కథలను ప్రేక్షకులు ఆదరించటం లేదు. సరికొత్త కథలనే ఇష్టపడుతున్నారు. కొత్తగానూ..కొత్తకథనంతో తీస్తేనే అన్ని తరగతుల ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే ఎస్‌ఐ కోదండపాణి సినిమాను సరికొత్తగా తెరకెక్కించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఆద్యంతం భావోద్వేగానికి గురిచేస్తుంది. క్లాస్, మాస్ ఎమోషన్లతోపాటుగా కామెడీ సన్నివేశాలు సగటు ప్రేక్షకుడు హాయిగా నవ్వుకునే ఉంటాయి. సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులంతా చాలా మంచి సినిమా చూశామనే భావనతో ఉంటారు’ అని హీరో మక్కా శ్రీను తెలిపారు. (Story : ‘ఎస్‌ఐ కోదండపాణి’ సూపర్‌హిట్ ఖాయం)