CPI పార్టీ మండల కమిటీ సమావేశం
న్యూస్‌తెలుగు / వినుకొండ : వినుకొండ శివయ్య భవన్ CPI ఆఫీస్ లో CPI పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షులుగా ధూపాటి మార్కు అధ్యక్షత వహించారు .ఈ సందర్భంగా CPI పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ:-” వినుకొండ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ శాఖ సమావేశాలు ఈ నెలాఖరికల్లా నిర్వహించాలని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికై గ్రామ శాఖ కార్యదర్శి పనిచేయాలని, అలాగే అర్హులైనటువంటి ప్రతి పేదవానికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా పనిచేయాలని, అలాగే CPI పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 26,2025 కి 100 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగరవేసి ఒక పండుగ వాతావరణాన్ని కల్పించాలని బూదాల శ్రీనివాసరావు తెలియజేశారు”. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సోమవరపు దావీదు, సోమవరపు కోటేశ్వరరావు, అంకారావు, గురవయ్య, సంపెంగుల సామ్సన్, మరియమ్మ, విశ్రాంతమ్మ, పిన్న బోయిన వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జున, మల్లవరపు గురుస్వామి, కత్తి నవీన్, తదితరులు పాల్గొన్నారు. (Story : CPI పార్టీ మండల కమిటీ సమావేశం)