జూనియర్ డాక్టర్ ని అతి కిరాతకంగా హతమార్చిన హంతకులను ఉరి తీయాలి
సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
న్యూస్‌తెలుగు / వినుకొండ : మంగళవారం రోజు వినుకొండ లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జూనియర్ డాక్టర్ పై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితులను వెంటనే ఉరి తీయాలి
అనే నినాదంతో వినుకొండ పురవీధుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినకొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థుల తో కలిసి ర్యాలీ గా నర్సరావుపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు వి వాంట్ జస్టిస్ అనే నినాదాలు చేసుకుంటూ వెళ్లడం జరిగింది .
ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ దేశమంతా 78వ స్వతంత్ర వేడుకలు జరుపుకున్నాము .
కానీ గాంధీ గారి చెప్పినట్లు అర్థరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది .అని ఆయన చెప్పిన మాటను ఒకసారి గుర్తు చేసుకుంటూ బ్రిటిష్ వారి నుండి స్వతంత్రం అయితే గాంధీ గారు తెచ్చారు .కానీ మన నల్ల దొరల నుండి ఇంకా స్వతంత్రం రానట్లేనా ఎక్కడ చూసినా వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయి .
కోల్ కత్తా లో జూనియర్ డాక్టర్ ఆరోజు రాత్రి తోటి వారితో ఒలంపిక్స్ గేమ్స్ చూసి రాత్రి భోజనం చేసి తన విశ్రాంతి గదికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ డాక్టర్ ఎలా రేపు కు గురైంది ఎలా మరణించింది .
ప్రిన్సిపాల్ ఎందుకు ఆత్మహత్య అని పోలీసులకు చెప్పింది .అని అనేక అనుమానాలు దేశ ప్రజల్లో ఉన్నాయి . ఆ తర్వాత ఎవరైతే జూనియర్ డాక్టర్ని హతమార్చాడు . ఆ ఉన్మాది ఎలా ఇంటికి వెళ్లి ప్రశాంతంగా పనుకున్నాడు అసలు ఆ కిరాతకుడు లోపలికి ఎలా ప్రవేశించాడు .
పోలీసులు వెళ్లి అతన్ని ప్రశ్నిస్తే నేనే చేశా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కావాలంటే ఉరేసుకోండి అని అంత ధైర్యంగా ఎలా చెప్పాడు దీని వెనుక ఎంతమంది పెద్దవాళ్ల పిల్లలు ఉన్నారో అన్నది చాలామందిలో ఉన్న సందేహం సుమారు పదిమంది వరకు ఈ ఘాతకంలో పాల్గొన్నారు .అని కొన్ని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి నిజా నిజాలను నెగ్గించాల్సిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఆమె జస్టిస్ కావాలని ర్యాలీలో పాల్గొనడం జనాలకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఏది ఏమైనా మన దేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై కఠినమైన చట్టాలను తీసుకువచ్చి వాటిని అమలును చేయాలని భారతదేశ పౌరులు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఉలవలపూడి రాము మాట్లాడటం జరిగింది .ఈ కార్యక్రమంలో కొప్పరపు మల్లికార్జునరావు,బి జయరాం,బి అశోక్,,ఎమ్మెస్సార్ ఆంజనేయులు
తారక్ నాగలక్ష్మి నూరి ప్రసన్న పెద్ద సంఖ్యలో సాయి డిగ్రీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు