ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి కృషి
న్యూస్‌తెలుగు / హైదరాబాద్: కజకిస్తాన్, తెలంగాణ మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కజకిస్తాన్ గౌరవ కాన్సుల్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, మహేశ్వరంలోలోని బీటీఆర్ గ్రీన్స్ – మ్యాక్ ప్రాజెక్ట్‌లో కజకిస్తాన్‌లోని అస్తానా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ బోర్డ్ చైర్మన్ యూసుఫ్ అల్జాదర్‌తో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూసుఫ్ అల్జౌదర్ అస్తానా అంతర్జాతీయ విమానాశ్రయం, వివిధ దేశాలలో 12 విమానాశ్రయాలను నిర్వహిస్తున్న టెర్మినల్ హోల్డింగ్స్ యూఏఈ కార్యకలాపాలపై సంక్షిప్తంగా వివరించారు. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రదీప్ పనికర్, ఏరో అండ్ కార్గో, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ దేశ, విదేశాలలో తమ కార్యకలాపాలు తెలిపారు.(Story:ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి కృషి)