ఎట్టకేలకు కందుల జయలక్ష్మి కేసు విచారణ ..!
న్యూస్ తెలుగు /చాట్రాయి : గత నాలుగు నెలల క్రితం అనుమానస్పద స్తితిలో మృతి చెందిన కందుల జయలక్ష్మీ కేసు విచారణ ప్రారంభమైంది. చాట్రాయి మండలం చనుబండ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కందుల కృష్ణ కూతురు ఏప్రిఎల్ 6వ తేదిన మృతి చెందగా తన కూతుర్ని హత్య చేశారని తరువాత నాలుగు రోజులకి చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు సరిగా పట్టించుకోలేదు. తన కూతుర్ని అక్రమంగా చంపేశారు అన్న వేదనలో ఉన్న కందుల కృష్ణ ఏపీ విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఐజి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసారు. ఇటీవల మంత్రి పార్థసారధిని హోంశాఖా మంత్రి అనితను కలిసి కందుల కృష్ణ ఫిర్యాదు చేశారు తన గోడు వెళ్ళ బుచ్చుకున్నారు . మరో సారి జిల్లా ఎస్పీని కలిసి మా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన కూతుర్ని ఎలా చంపారు అనడానికి ముందు ఏం జరిగింది ఫోన్ నెంబర్లు లాప్టాప్ లో ఆధారంగా కేసును విచారించాలని ప్రాధేయపడ్డారు. తన కూతుర్ని చంపిన వ్యక్తిని కొంతమంది వ్యక్తులు కోళ్లదొడ్డిలో దాచారని ఆవేదన వ్యక్తం చేయడంతో. మంగళవారం ఉదయం నుంచి విచారణ ప్రారంభమైంది . చాట్రాయి తహసిల్దార్ డి ప్రశాంతి పోలీస్ అధికారులతో కలిసి స్మశాన వాటిక వద్దకు వెళ్లి పరిశీలించారు. కేసు విచారణను వేగవంతం చేశారు. ఏం జరుగుతుందోనని ప్రజలు ఉత్కంఠతతో చర్చించుకుంటూ ఉన్నారు. (Story : ఎట్టకేలకు కందుల జయలక్ష్మి కేసు విచారణ ..!)