UA-35385725-1 UA-35385725-1

ఇక..తెలంగాణాకే అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ 

ఇక..తెలంగాణాకే అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ 

న్యూస్‌ తెలుగు-అమరావతి: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సేవలు ఇక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కానున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా దశాబ్దాలుగా సేవలందించిన ఈ యూనివర్సిటీకి తాజాగా తెలంగాణ విద్యార్థుల నుంచే ప్రవేశాలను ఆహ్వానించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఏపీ విద్యార్థులు ప్రవేశాలను స్వీకరించలేకపోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఏపీఓయూ)ను 1982 ఆగస్టు 26వ తేదీన అసెంబ్లీలో ఆమోదించగా, అనంతరం దీనిని హైదరాబాద్‌లో నిర్మించారు. తదనంతరం 26 అక్టోబరు 1991న దీనికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం(డాక్టర్‌ బీఆర్‌ఏఓయూ)గా పేరు మార్చారు. ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమో, డిప్లొమో, బీఈడీ, సర్టిఫికెట్‌, పీహెచ్‌డీ కోర్సులలో ప్రతి విద్యా సంవత్సరం ప్రవేశాలు నిర్వహించారు. 2023`24 విద్యా సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రవేశాలను స్వీకరించారు. దీనికి నాక్‌ ఏ`గ్రేడ్‌తోపాటు యూజీసీ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో (డెబ్‌) అనుమతులున్నాయి. ఇందులో డిగ్రీలు చదివిన వారికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలకు చెల్లుబాటవుతాయి. రెగ్యులర్‌ విద్యార్థులకు సమాంతరంగా ఆయా స్టడీ సెంటర్లలో వారంతరపు తరగతులను నిర్వహిస్తుంటారు. ఏపీలో 76 స్టడీ సెంటర్ల ద్వారా 50వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన అనంతరం నుంచి అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం తెలంగాణకు చెందుతుందని ప్రచారం రాగా,పదేళ్లపాటు రెండు రాష్ట్రాల్లో ప్రవేశాలు విజయవంతంగా కొనసాగాయి. 2024`25 విద్యా సంవత్సరానికిగాను ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రవేశాలు స్వీకరించేందుకు ఓపెన్‌ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అనేక మంది అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలు చదివి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో రాణిస్తున్నారు. ఒక్కసారిగా ప్రవేశాలను నిలిపివేయడంతో ఏపీ విద్యార్థులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మన ప్రభుత్వం చర్చి, యథాతథంగా ప్రవేశాలు కొనసాగించేలా చూడాలని కోరుతున్నారు. భవిష్యత్‌లో ఏపీ కేంద్రంగా అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీని నెలకొల్పాలని కూటమి ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. (Story : ఇక..తెలంగాణాకే అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1