ట్రాన్స్ జెండర్లకు శుభవార్త !
రేషన్‌కార్డులిచ్చే ఆలోచన
న్యూస్ తెలుగు-అమరావతి: రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలపనుంది. సాధారణ ప్రజలు తరహాగానే వారికి కూడా ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే జరిగితే రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లు అందరికీ న్యాయం చేకూరుతుంది. వారికి కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు దరిచేరతాయి. ట్రాన్స్‌జెండర్లకూ రేషన్‌కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. రాజధాని కేంద్రమైన వెలగపూడి సచివాలయంలో మంగళవారం విభిన్న ప్రతిభావంతులు, వయో వయోవృద్దులు,ట్రాన్స్ జెండర్లు సంక్షేమంపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తూ..ఈ విషయాన్ని వెల్లడిరచారు. దివ్యాంగులతోపాటు వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్లకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు దరిచేరాలన్నారు. ట్రాన్స్ జెండర్లతో స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు ప్రోత్సహించాలని, వారికి స్వయం ఉపాధి కల్పించి సమాజంలో గౌరవంగా బతికేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. (Story : ట్రాన్స్ జెండర్లకు శుభవార్త !)