Home వార్తలు తెలంగాణ ప్రజావాణి దరఖాస్తుల స్వీకరించిన జిల్లా కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తుల స్వీకరించిన జిల్లా కలెక్టర్

0

ప్రజావాణి దరఖాస్తుల స్వీకరించిన జిల్లా కలెక్టర్

న్యూస్‌తెలుగు/ములుగు జిల్లా : అధికారులు ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి. తొ కలసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి, ప్రజాదర్బార్ కు సంబంధించిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పరిష్కరించాలని పేర్కొన్నారు.
వారం వారం వస్తున్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం అంశంపై శాఖలు, మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ప్రతి మండలంలో పెండింగ్లో ఉన్న సమస్యలు, వాటికి
గల కారణాలు, పరిష్కరించేందుకు సిద్ధం చేసుకున్న ప్రణాళిక వివరాలను కలెక్టర్ తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్
దరఖాస్తుల పై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆనంతరం జిల్లా కలెక్టర్ కు రాఖీ ని పిల్లలు, పెద్దలు కట్టారు.ఈ కార్యక్రమాల్లో డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య,డిసిఓ సర్దార్ సింగ్,
ఎస్సీ కార్పొరేషన్ ఈ డి తుల రవి, ఇతర అధికారులు, తహసీల్దార్లు, ఎం పి డి ఓ లు, ఎంపి ఓ లు, తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజావాణి దరఖాస్తుల స్వీకరించిన జిల్లా కలెక్టర్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version