UA-35385725-1 UA-35385725-1

శృతిమించిన షాడోయిజం..?

శృతిమించిన షాడోయిజం..?

చాట్రాయి మండలంలో టిడిపి మండల కమిటీ ఉందా..? లేదా..?

న్యూస్ తెలుగు /చాట్రాయి : అధికార తెలుగుదేశం పార్టీలో.. రోజు…రోజుకు ..షాడోయిజం శృతిమించుతున్న నేపథ్యంలో చాట్రాయి మండలంలో తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఉందా… లేదా…? నిర్మాణపరంగా…. సంస్థా గతంగా క్షేత్రస్థాయిలో పటిష్టమైన 40ఏళ్ళ తెలుగుదేశం పార్టీలో మండలప్రధాన కమిటీలు 21 పదవులు అనుబంధ సంఘాలతో కలిపి 250 పైగా పదవులు ఉండగా 4.మార్చి. 2024 వ తారీకు రాత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కింజారపు అచ్చంనాయుడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని కీర్తిశేషులు దివంగత నేత మండల టిడిపి మాజీ మండల అధ్యక్షులు బొట్టు విజయ్ చౌదరి సతీమణి వరలక్ష్మికి మండల పార్టీ అధ్యక్షురాలుగా ఉత్తర్వులు ఇచ్చిన దగ్గర నుంచి ఆమెకు సహాయకుడి పేరుతో వచ్చిన ఓ వ్యక్తి పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చాట్రాయి మండలం మొత్తం అధికారులు, తెలుగుదేశం పార్టీ చిన్న పెద్ద గ్రామ నాయకులు అందరూ తాను చెప్పిందే శాసనంగా వినాలని బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం వారికి ఇష్టం లేని వారితో మాట్లాడిన ఉద్యోగస్తులను గాని కార్యకర్తలను గాని ఊరుకునే ప్రసక్తే లేదని నచ్చని వారిని వెలివేసినట్లుగా బాహాటంగా మాట్లాడుతున్నట్లు అనేక సందర్భాలలో వినవస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ మంత్రి అయిన సారధికి చాట్రాయి మండలంలో జరుగుతున్న పరిణామాలు శృతిమించుతున్న షాడోయిజం గురించి అస్సలు తెలుసా…? లేదా…? అనేది కూడా పెద్ద చర్చ జరుగుతుంది. కొంతమంది మంత్రి గారికి తెలిస్తే సహించరు అంటుండగా మరికొందరు మంత్రి గారే ప్రొత్సహిస్తున్నారా అనే విధంగా కూడా చర్చించుకోవడం గమనార్హం. కొంతమంది మంత్రిగారి దగ్గర లెటర్ ఇప్పిస్తామంటూ ఒక ఉద్యోగి దగ్గర వేలాది రూపాయలు వసూలు చేసుకున్నట్లు గుసగుసలు వినవచ్చాయి. దివంగత నేత బొట్టు విజయ్ చౌదరి మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మండల కేంద్రమయిన చాట్రాయి గ్రామంలో తన వ్యక్తిగత నిధులతో మండల కార్యాలయాన్ని నడిపించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను వైసిపి పాలనలో లాక్కుంటున్న సందర్భంలో విజయ్ చౌదరి తుమ్మగూడెం గ్రామంలో ఇళ్ల స్థలాలను రక్షించుకోవడం కోసం రాత్రి కి రాత్రే రేకులు స్తంభాలు తెప్పించి వాటిని నిలబెట్టి అనేక మందికి రెండున్నర సెంట్ల ఇళ్ల స్థలాన్ని దక్కించేలా చేశారు. పంచాయితీ ఎన్నికలలో అనేక గ్రామాలలో అభ్యర్థులుగా పోటీ చేసే వారికి ఆర్థిక సహాయ సహకారాలను అందజేశారు. పార్టీలో ఐకమత్యం పెంచడానికి సమన్వయ సారధిగా మంచి గుర్తింపు నే సాధించారు. కరోనాకాలంలో ఆయన చనిపోయిన తర్వాత కొద్ది నెలలకు ఆయన సతీమణి బొట్టు వరలక్ష్మిని అధ్యక్షురాలుగా చేశారు. ఆరు నెలలు గడిచిన తర్వాత అప్పట్లో నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు పార్టీ కార్యక్రమాలు వేగవంతం కావడం లేదనే పేరుతో మండల పార్టీ నాయకులతో సంప్రదించి పోలవరం గ్రామానికి చెందిన మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు)ను చనుబండ పంచాయతీ సూరంపాలెం గ్రామంలో తెలుగు రైతు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు నివాసం ముందు మండలంలోని 18 గ్రామాల కార్యకర్తలు నాయకుల తో ఓ పెద్ద సభ ఏర్పాటు చేసి మండల పార్టీ అధ్యక్షుడు చిట్టిబాబు అని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ రిజిస్టర్లలో విజయ్ చౌదరి చనిపోయి రెండు సంవత్సరాల అయిన తర్వాత కూడా ఆయన పేరే ఉండటం వలన ఎన్నికల ముందు నియోజకవర్గ అభ్యర్థి పార్థసారధి రావడంతో అప్పటికే మూటలు ఉధృతంగా ఉన్న నేపథ్యంలో మరిడి చిట్టిబాబు వ్యతిరేక వర్గీయులు మొత్తం గ్రామ కమిటీలలో ఉన్నవారు మండల పార్టీ అధ్యక్షుడిని మార్చాలంటూ ఫిర్యాదు చేయడంతో వాటి ఆదారంతోనే రాత్రికి రాత్రే మండల పార్టీ అధ్యక్షుడిని మార్చేశారు. బొట్టు వరలక్ష్మి ని అధ్యక్షురాలుగా ప్రకటించారు. అప్పటికే చాట్రాయి మండల పార్టీ ముఠాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తన వ్యక్తిగత అనుచరుల ద్వారా పూర్తిస్థాయి సమాచారం తెలుసుకున్న సారథి ఎన్నికలలో మండలం పై ప్రత్యేకమైన దృష్టి సారించి ఆయన యావత్తు కుటుంబం పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ విజయం సాధించారనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. అయితే ఒక వ్యక్తి మాత్రం చాట్రాయి మండలంలో టిడిపికి ఓటింగ్ శాతం పెరగడానికి తన ఒక్కడినే కారణమంటూ ప్రచారం చేసుకోవడమే కాకుండా మంత్రి సారధికి పదవి వచ్చిన తర్వాత తన సిఫారసుతోనే పదవి వచ్చింది అని చెప్పుకోవడంతో నాయకులు కార్యకర్తలు విస్తుపోయిన పరిస్థితి. చీపురుగూడెం కోళ్ల ఫారం వివాదం నేపథ్యంలో 9 పంచాయతీలపై ఎంక్వైరీ వేయించారు. ఒక అధికారి పెద్ద అవినీతిపరుడని వైసిపి పెద్ద నాయకుడికి భజనపరుడని వ్యక్తిగత అనుచరుడని మొదట చెప్పిన వాళ్లే అదే అధికారికి సిఫారసు లేఖలు ఇప్పించడం సారధి దగ్గర తన ఒక్కడికే ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పుకోవడం చనుబండ గ్రామంలో చెత్త సంపద తయారీ కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికుల జీతాలు వైసీపీ నాయకులతో కలిసి 14 లక్షల రూపాయలను అక్రమ పద్ధతిలో మార్చుకున్న అధికారికి షాడో మద్దతు ఇవ్వడంతో మంత్రి సారధిని అబాసపాలు చేయడానికా ….? మండల తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించడానికి ఎందుకు ఈ షాడో శృతిమించుతున్నారని చర్చలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. షాడోయిజానికి వ్యతిరేకంగా ఊరూరా శాప కింద నీరులా వ్యతిరేకత పెరుగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. (Story : శృతిమించిన షాడోయిజం..?)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1