హిందూస్తాన్ జింక్‌కు 5`స్టార్ రేటింగ్!
ఉదయపూర్‌ం భారతదేశంలో అతిపెద్ద, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సమగ్ర జింక్ ఉత్పత్తిదారు అయిన హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ నుండి 5`స్టార్ రేటింగ్‌ను అందుకుంది. స్టార్ రేటింగ్ సిస్టమ్ ఆధారంగా 2022`23 సమయంలో సస్టెయినబుల్ డవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ అమలులో దాని శ్రేష్టమైన పనితీరుకు కంపెనీ ఈ గుర్తింపును పొందింది. 2022`23 సమయంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ద్వారా 1200 కంటే ఎక్కువ గనులు మూల్యంకం చేయబడ్డాయి. 68 గనులకు 5`నక్షత్రాల రేటింగ్‌ను అందించింది. భారతదేశంలోని 68 గనులలో, హిందూస్తాన్ జింక్‌కు చెందిన రాంపూరా అగుచా, సింధేసర్ ఖుర్ద్ గనులు ప్రతిష్టాత్మకమైన 5`స్టార్‌ను పొందిన పూర్తిగా మెకనైజ్ చేయబడిన భూగర్భ గనులు మాత్రమే. ప్రభావ ఆధారిత సంస్థగా, జింక్ సిటీలోని జీరో లిక్వడ్ డిశ్చార్జ్ ప్లాంట్, డ్రై ట్రైలింగ్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి కర్మాగారం వంటి వినూత్న పద్ధతులను అమలు చేయడం ద్వారా, పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా హిందూస్తాన్ జింక్ స్థిరమైన, సమగ్ర వృద్ధికి కట్టుబడి ఉంది. కంపెనీ భూగర్భ జలాల రీఛార్జ్ నిర్మాణాలను కూడా ఉపయోగిస్తుంది. గ్రీన్ పవర్ ద్వారా దాని శక్తి అవసరాల్లో 50%పైగా తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. (Story : హిందూస్తాన్ జింక్‌కు 5`స్టార్ రేటింగ్!)