Homeవార్తలుతెలంగాణపలు వివాహ వేడుకలలో  పాల్గొన్న మాజీ మంత్రి

పలు వివాహ వేడుకలలో  పాల్గొన్న మాజీ మంత్రి

పలు వివాహ వేడుకలలో  పాల్గొన్న మాజీ మంత్రి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : మాజీమంత్రి నిరంజన్ రెడ్డి గారు సన్మానాలు,ఆత్మీయ పలకరింపులు, పరామర్శలతో పట్టణములో మరియు గ్రామాలలో గౌరవ నిరంజన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ప్రముఖ న్యాయవాది శేషీభూషణ్ గారు ఇటీవల నూతన గృహప్రవేశం చేశారు.గౌరవ నిరంజన్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్లి శేషీభూషణ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. 32వ వార్డుకు చెందిన ఉంగ్లమ్ వారి ఇంటిలో జరుగుతున్న పెళ్లివేడుకలో పాల్గొని నూతన వరుడు ఉంగ్లమ్.పవన్ కుమార్ ని ఆశీర్వదించారు. పానుగల్ గ్రామానికి చెందిన ఏర్పుల. కురుమూర్తిశాంత గార్ల కూతురు వివాహ వేడుకలు స్థానిక 30వార్డ్ జంగిడిపురంలో జరిగాయి.ఈ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు నూతన వధువు అఖిలను ఆశీర్వదించారు. లక్మిపద్మావతి గార్డెన్ నందు మాజీ వైస్ చైర్మన్ బాషెట్టి.శ్రీనివాసులు కూతురు వివాహ వేడుకలలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వివాహ శుభకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. గాంధీనగర్ వివాహ వేడుకలలో వరుడు శ్రీశైలం సాగర్ గారిని ఆశీర్వదించి సత్యనారాయణ స్వామి వ్రతములో పాల్గొన్నారు.
హైస్కూల్ రోడ్ నందు నూతనం ఏర్పాటు చేసిన శివారెడ్డి స్వీట్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ నిరంజన్ రెడ్డి పాల్గొని యజమానులు రాంరెడ్డి మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేసారు.
అదేవిధంగా శ్రీరంగాపుర్ గ్రామములో బి.ఆర్.ఎస్ నాయకులు చీర్ల.విష్ణుసాగర్ గారి కూతురు ప్రతానములో పాల్గొని వధువును ఆశీర్వదించారు.
శ్రీరంగాపురం మండల ఉద్యామనాయకుడు పర్వతాలు గారి అన్న అర్జున్ గారిని నిరంజన్ రెడ్డి గారు ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది.అర్జున్ గారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుకున్నారు.
గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామ బి.ఆర్.ఎస్ నాయకులు రాంబాబు గారి కూతురు ప్రథానానికి హాజరై నూతన వధువు సాయిదీక్షితను ఆశీర్వదించారు.
నిరంజన్ రెడ్డి వెంట వాకిటి.శ్రీధర్, పి.రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్,కౌన్సిలర్స్ బండారు.కృష్ణ,నాగన్న యాదవ్, నాయకులు ఉంగ్లమ్. తిరుమల్, నీలస్వామి,గులాం ఖాదర్ ఖాన్,స్టార్.రహీమ్,వెంకట్ సాగర్ ప్యాట.తిరుపతయ్య,గౌడ నాయక్,చిట్యాల.రాము, ఖాదర్షా,తోట.శ్రీను,రవి ఉన్నారు.
శ్రీరంగపూర్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి, పృథ్వీరాజ్, తెరాస ఉద్యమనాయకుడు పర్వతాలు,,గౌడ నాయక్,వేంకటేశ్వర రెడ్డి, జె.కురుమూర్తి,అర్జున్,ఎం.డి.షఫీ,ఎం.డి.అవేజ్,ఎం.డి. ఆరీఫ్ తదితరులు ఉన్నారు.
గోపాల్ పేట మండల నాయకులు బాలరాజు,తిరుపతయ్య,మతీన్,చంద్రశేఖర్,రాజేష్ గౌడ్,నాగరాజు తదితరులు ఉన్నారు. (Story : పలు వివాహ వేడుకలలో  పాల్గొన్న మాజీ మంత్రి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!