కాంటాక్ట్ లెన్స్ మీ కార్నియాను డ్యామేజ్ చేస్తుందా?
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: కాంటాక్ట్ లెన్స్‌లు, నిస్సందేహంగా దృష్టి దిద్దుబాటు (విజన్ కరెక్షన్)లో ఒక పెద్ద పురోగతిని సాధించాయి, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు సౌలభ్యం అలాగే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే, వాటిని సరిగ్గా ఉపయోగించడం రాకపోవడం అలాగే తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన కార్నియాలో డ్యామేజ్ కలుగవచ్చు, ఇంకా ఇతర సమస్యలు తలెత్తవచ్చు. ఈ ప్రమాదాలలో ఎక్కువ భాగం ఇతర ప్రమాదలకంటే అధికంగా సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు తెలియనితనం వలన తమ కాంటాక్ట్ లెన్సుల గురించి సరైన జాగ్రత్తలు తీసుకోరు. ఆరోగ్యవంతమైన కళ్లను కాపాడుకోవడానికి కంటి సమస్యలకు కారణమేమిటో, వాటిని ఎలా నివారించాలో తెలుసుకోవడం చాలా అవసంమని అపోలో స్పెక్‌ట్రా హాస్పిటల్స్ (హైదరాబాద్) క్యాటరాక్ట్`కార్నియా సర్జన్ డాక్టర్ అల్పా అతుల్ పూరబియా తెలిపారు. ఇన్ఫెక్షన్‌లు వచ్చినా, కార్నియల్ రాపిడి జరిగినా, అలాగే ఆక్సిజన్ ప్రవాహం తగ్గడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని తెలిపారు. కాంటాక్ట్ లెన్స్‌లను సరిగ్గా శుభ్రం చేయకపోతే, లెన్స్‌లపై బ్యాక్టీరియా, ఫంగస్ సులభంగా అభివృద్ధి చెందుతాయని కూడా తెలిపారు. (Story : కాంటాక్ట్ లెన్స్ మీ కార్నియాను డ్యామేజ్ చేస్తుందా?)