UA-35385725-1 UA-35385725-1

కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఆకుల రామకృష్ణ?

కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఆకుల రామకృష్ణ?

హర్షం వ్యక్తం చేస్తున్న కాపు సంఘాలు

న్యూస్‌తెలుగు/అమలాపురంః ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఆకుల రామ‌కృష్ణ నియ‌మితుల‌య్యే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. నేడో రేపో దీనికి సంబంధించి ఉత్త‌ర్వులు వెలువ‌డవ‌చ్చ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెపుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బిజెపి… మూడు పార్టీల కుటమి ప్రభుత్వం కొలువుతీరి రెండు నెలలు పూర్తి కావడంతో నామినేటెడ్ పదవులపై ఆ పార్టీల్లో ఆశావ‌హులు పదవులు పొందేందుకు పైరవీలు మొదలుపెట్టి ఆ పార్టీ నేతలను ప్రసన్న చేసుకుంటూ ఎదురుచూపులు చూస్తున్నారు ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాల‌తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల లో కాపుల ప్రభావం అత్యధికంగా ఉండటంతో ఈసారి కాపు కార్పొరేషన్ చైర్మన్ కోస్తా జిల్లాలకు చెందిన వ్యక్తికి కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా సమర్థత కలిగిన వ్యక్తిని ఎంపిక చేసి, తద్వారా ఆ వర్గాలను సంతృప్తి పరచడంతో పాటు వివిధ రకాల సంక్షేమ సేవా కార్యక్రమాలు అమలు జరపటం ద్వారా కాపు సామాజిక వర్గీయులు ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెంపొందించుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. 2014లో అప్పుడు ఏర్పాటైన ఇదే కూటమి ప్రభుత్వం జనసేన ప్రభుత్వంలో భాగస్వామ్యం కానప్పటికీ అప్పుడు కూటమి విజయానికి కృషి చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులకు సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున నిధులు కేటాయించి కాపుల అభ్యున్నతికి కృషి చేస్తామని ప్రకటించి అమలు చేసిన సంగతి తెలిసిందే. 2019లో ఏర్పాటు అయిన వైసీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసి, ఎలాంటి నిధులు కేటాయించకుండా అటుకెక్కించింది. దీంతో ఆ ప్రభుత్వంపై ఆగ్రహించిన కాపులు ఈసారి కూటమి ప్రభుత్వానికి 90 శాతం మద్దతిచ్చి ఓట్లు వేసి వెన్నుదన్నుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చూపు సమర్థత గల నాయకుడు, గత 30 సంవత్సరాల నుండి కాపు ఉద్యమాలు కాపు పోరాటాల్లో తనదైన ముద్ర వేసుకొని యువతలో మంచి బలమైన నాయకుడిగా పేరు ఉన్న, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం, రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఆకుల రామకృష్ణపై ప‌డింది. ఆయ‌న‌ పేరు ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆకుల రామకృష్ణకు ఈ చైర్మన్ గిరీ ఇవ్వడం ద్వారా అటు ప్రభుత్వానికి ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. మరొకపక్క తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుండి ఆ పార్టీలో కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్య నాయకునిగా కీలక వ్యక్తిగా వ్యవహరిస్తూ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్‌గా, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు గాను అలాగే పార్టీలో వివిధ హోదాలు నిర్వహిస్తూ మధ్యలో కొంత విరామం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే అత్యంత విశ్వాసంతో పని చేసిన ఆకుల రామకృష్ణకు సముచిత స్నానం కల్పించాల‌ని భావ‌న‌తో చంద్రబాబు నాయుడు ఆకుల వైపే ముగ్గు చూస్తున్నారు. ఇప్పటికే కాపు సామాజిక వర్గాల కాపుల్లోనూ సంఘ నాయకులు కార్పొరేషన్ చైర్మన్ ఆకుల రామకృష్ణకు ఇవ్వడం సరైన నిర్ణయమని, అన్న ప్రకారం నిధులు కేటాయించి కాపులకు విదేశీ విద్య మహిళలకు భరోసా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని కాపు సంఘాల నుంచి అభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఆకుల రామ‌కృష్ణ ఎంపిక స‌రైన‌దే అవుతుంద‌ని ఆ సంఘాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి. (Story: కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఆకుల రామకృష్ణ?)

See Also

ఎట్టకేలకు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు జోగి రమేష్‌

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1