UA-35385725-1 UA-35385725-1

వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాకారమే సీఎం చంద్రబాబు స్వప్నం

వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాకారమే సీఎం చంద్రబాబు స్వప్నం

 78వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవీ, మక్కెన

న్యూస్‌తెలుగు/వినుకొండ : ప్రజలు ఎన్నో కష్టనష్టాలు, శ్రమకోర్చి తిరిగి సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ఫలంగా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలిపేలా వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాకారమే సీఎం చంద్రబాబు స్వప్నం అన్నారు వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. రాష్ట్రంలో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మరో ప్రత్యేకత కూడా ఉందని, అయిదేళ్ల నిరంకుశ పాలనపై ప్రజా విజయమే ఆ ప్రత్యేకత అన్నారాయన. రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల విలువను మరోసారి తెలియజేసిన అయిదేళ్ల చీకటిపాలనపోయిన ఈ సందర్భం ఈ సందర్భం ఎప్పటికీ ప్రత్యేకం అన్నారాయన. గురువారం వినుకొండ పట్టణంలో 78వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం స్వీకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రి, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నాటి స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికి అద్దం పట్టేలా పట్టణం, గ్రామాల్లో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వేచ్ఛస్వాతంత్ర్యాల ఫలితంగానే ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించుకోగలుగుతున్నామని , వారందరి త్యాగాలు, కృషిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.‌ అంచెలంచెలుగా ఎదుగుతున్న స్వతంత్ర భారతంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నామన్నారు జీవీ. ఈ సంవత్సరం ఉత్సవాలకు ఉన్న మరో ప్రత్యేకత… వికసిత భారత్ సంకల్పం అని 2047 నాటికి దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలి అన్నదే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. అదే స్ఫూర్తితో వికసిత భారతంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్ల అగ్రగామిగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ స్వప్నాన్ని సంకల్పంగా పెట్టుకున్నారని.. అందుకు అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా, చదువుకున్న విద్యావంతులందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ ను కచ్చితంగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి ఏపీని అన్ని రంగాల్లో ముందు ఉంచడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కోల్పోయారని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. మళ్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అరాచక పాలన పోవాలని, అవినీతి పాలన పోవాలని ప్రజలు విప్లవాత్మకమైన తీర్పునిచ్చారన్నారు. అందుకే రాష్ట్రంలో కూటమి 93శాతం సీట్లు కైవసం చేసుకుందన్నారు. గతంలో రూ.3 వేలు ఉన్న పింఛన్ ను 4 వేలు చేశారని, విభిన్న ప్రతిభావంతులకు గతంలో ఉన్న పింఛన్ ను రూ.6 వేలు చేశారని… కష్టాల్లో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేయూతగా నిలబడ్డారని కొనియాడారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, పేదరిక నిర్మూలన కోసం సీఎం చంద్రబాబు ఎన్నో చర్యలు చేపడుతున్నారని చెప్పారు. నవ సమాజ నిర్మాణం కోసం కుల, మతాలకు అతీతంగా అందరూ ముందుకి నడవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అలానే రాష్ట్రంలో పేదల ఆకలి బాధలు తీర్చేలా మహత్తరమైన అన్నక్యాంటీన్ల పథకానికి ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగానే పున:ప్రారంభించారని, తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్నక్యాంటీన్లు ప్రారంభించనున్నారని అన్నారు. మలిదశలో రాష్ట్రవ్యాప్తంగా వీటి సంఖ్యను మరింత విస్తరించనున్నారని, అతి తక్కువ ఖర్చుతో పేదలకు మూడు పూటల ఆకలి తీర్చనున్నారని, రూ. 5 చొప్పున మొత్తం 15 రూపాయలతో రోజు మూడు పూటలా కడుపు నిండా తినవచ్చని పేర్కొన్నారు. పేదవారి కోసం ఇటువంటి అన్న క్యాంటీన్లు ప్రతిచోటా, ప్రతి మండలస్థాయిలో కూడా రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. త్వరలోనే వినుకొండలో ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేసి చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా శిక్షణఇచ్చి కొత్తవారికి ఉపాధి అవకాశాలు లభించేలా చేస్తామన్నారు. వినుకొండలో పేదరిక నిర్మూలన కోసం, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొనిజేటి నాగ శ్రీను రాయల్ ,బిజెపి జిల్లా నాయకులు మేడం రమేష్, మండల తహసిల్దార్ గారు సురేష్ నాయక్, ఎంఈఓ జఫ్రూలాఖాన్, పట్టణ ఇనిస్పెక్టర్ కత్తి స్వర్ణలత,అధికారులు, టిడిపి జనసేన బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాకారమే సీఎం చంద్రబాబు స్వప్నం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1