జీ తెలుగులో మెగా ఈవెంట్ ‘శ్రావణలక్ష్మి’, ప్రేమలు
న్యూస్‌తెలుగు/ఖమ్మం: శ్రావణమాసం ప్రత్యేకంగా ఆదోని వేదికగా నిర్వహించిన జీ తెలుగు మెగా ఈవెంట్ ‘శ్రావణలక్ష్మి’ని ఆగస్ట్ 18వ తేది మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనుందనీ సంస్థ ప్రతినిదులు ఒక ప్రకటనలో తెలిపారు. సరికొత్త సినిమాలతో అలరించే జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమా ప్రేమలుని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందించేందుకు సిద్ధమైందన్నారు. నస్లెన్ కె గఫూర్, మమితా బైజు నటించిన ప్రేమలు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఆగస్టు 18 సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారమవుతుందన్నాన్నారు. జీ తెలుగు ఇటీవల ఆదోనిలో ప్రముఖ నటీనటులతో శ్రావణమాసం ప్రత్యేక కార్యక్రమం ‘శ్రావణలక్ష్మి’ మెగా ఈవెంట్ని నిర్వహించి వీక్షకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించిందన్నారు. జీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న జాబిల్లికోసం ఆకాశమల్లే, మా అన్నయ్య సీరియల్స్ నటీనటులు ఈ వేదికపై నుంచి తమ అభిమానులతో సంభాషించి వారి సంతోషంలో పాలుపంచుకున్నారన్నారు. (Story : జీ తెలుగులో మెగా ఈవెంట్ ‘శ్రావణలక్ష్మి’, ప్రేమలు )