ఇంజినీరింగ్‌కు ఇదే చివరి అవకాశం
న్యూస్ తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ విద్య చదవాలనుకునే విద్యార్థులకు చివరి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు భర్తీ అవ్వగా, మిగిలి పోయిన సీట్ల భర్తీకిగాను మూడో విడత వెబ్ కౌన్సెలింగ్‌కు షెడ్యూలు విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్‌లో గత మొదటి, రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌లలో సీట్లు పొంది, ఆయా కళాశాలలు, బ్రాంచీలపై అంతగా ఆసక్తి లేని వారూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను ఏపీఈఏపీసెట్ 2024 ర్యాంకుల ఆధారంగా నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులంతా ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకున్న వారి ధ్రువీకరణ పత్రాలను ఈనెల 22వ తేదీలోగా ఆన్‌లైన్లో పరిశీలిస్తారు. 22వ తేదీ నుంచి 24 మధ్య వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈనెల 26వ తేదీన ఇంజినీరింగ్ సీట్లు ప్రకటిస్తారు. సీట్లు ఖరారైన విద్యార్థులంతా ఈనెల 26వ తేదీ నుంచి 30 మధ్య ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు స్వయంగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అంతకుముందు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాలి. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారికి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభమయ్యాయి. మూడో విడత కౌన్సెలింగ్ వారికీ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే తరగతులు నిర్వహిస్తారు. ఏపీ ఈఏపీసెట్2024లో అర్హత సాధించిన ఇంజినీరింగ్ అభ్యర్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. పూర్తి వివరాలను ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్ ద్వారా ఏపీఈఏపీసెట్ 2024 వెబ్‌సైట్‌లోకి వెళ్లగలరు. (Story: ఇంజినీరింగ్‌కు ఇదే చివరి అవకాశం)