మొదటి సీయూవీ-ఎంజీ విండ్సర్ కొత్త టీజర్ విడుదల
న్యూస్‌తెలుగు/గురుగ్రామ్: జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తమ రాబోయే వాహనం, భారతదేశపు మొదటి క్రాస్ ఓవర్ యుటిలిటి వెహికిల్ (సీయూవీ) ఎంజీ విండ్సర్ కొత్త టీజర్‌ను విడుదల చేసింది. వాహనం నీటిని చీల్చుకుంటూ ప్రయాణించగలిగే సామర్థ్యాలను ఇది చూపించింది. ఈ సరికొత్త టీజర్ ఎంజీ విండ్సర్ ఇంజనీరింగ్ శ్రేష్టత, భారతదేశపు రోడ్ల పరిస్థితులకు అనుకూలత, విభిన్నమైన భూ ప్రాంతాల కోసం ఇంటిలిజెంట్ సీయూవీగా దాని స్థానాన్ని సూచించింది. వర్షాకాలంలో భారతదేశంలో కారు డ్రైవర్లు ఎదుర్కొనే సాధారణ సమస్య వంటి సమస్యాత్మకమైన భూభాగాల్లో టీజర్ ఎంజీ విండ్సర్ ఆత్మవిశ్వాసంతో ప్రయాణిస్తుంది. ఎంతో సూక్ష్మంగా రూపొందించబడిన డిజైన్‌తో, విండ్సర్ సులభంగా నీటి లోతులను నిర్వహిస్తుంది. ఈ సామర్థ్యం వాహనం పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్‌తో, సీయూవీ భంగిమతో సాధ్యమవుతుంది, అత్యంత సవాలుతో కూడిన భూభాగాల్లో కూడా సాఫీ మరియు సురక్షితమైన డ్రైవ్ ను నిర్థారిస్తుంది. (Story : మొదటి సీయూవీ-ఎంజీ విండ్సర్ కొత్త టీజర్ విడుదల)