కార్పొరేట్‌లో సైనిక నైపుణ్యానికి సుప్రియ సేవలు ఉదాహరణ
న్యూస్‌తెలుగు/బెంగళూరు: అమెజాన్ ఇండియాలో, ఈ అసాధారణమైన ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కంపెనీలో ప్రభావంతమైన విధులకు సైనిక సేవల నుంచి సాఫీగా మారడానికి ఉద్దేశించిన అంకితమైన కార్యక్రమాలను ద్వారా అందిస్తుంది. అటువంటి మార్పులు కార్పొరేట్ రంగంలో గణనీయమైన సహకారానికి ఎలా దారితీస్తాయో సుప్రియ ప్రయాణం ఉదాహరణగా నిలుస్తుంది. నూతన వాతావరణంలో ఆవిష్కరణలు, విజయాన్ని సాధించడంలో సైనిక నైపుణ్యపు విలువను ఆమె ప్రదర్శిస్తున్నారు. సుప్రియ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో విధుల్లో చేరేందుకు ముందుగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. విధుల్లో ఉన్నప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేశారు. ఆమె తన జీవితంలో మహోన్నతమైన సేవలు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రతిష్టాత్మకమైన భారతీయ వైమానిక దళంలో సాంకేతిక శాఖలో చేరేలా చేసింది. సుప్రియ 2021 సంవత్సరంలో అమెజాన్ మేనేజర్-వర్క్‌ప్లేస్ హెల్త్ అండ్ సేఫ్టీలో చేరారు. భారతదేశంలోని అమెజాన్ అతిపెద్ద సార్టేషన్ సెంటర్‌లలో సిబ్బంది, పరికరాల నిర్వహణ భద్రత బాధ్యతను ఆమె తీసుకున్నారు. ఏడాదిన్నర అనంతరం ఆమె కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ టీమ్‌కి మారారు. అక్కడ అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ నెట్‌వర్క్ కోసం కమ్యూనిటీ వాలంటీరింగ్ ప్రోగ్రామ్‌లకు వ్యూహరచనలో ఆమె విజయం సాధించారు. (Story : కార్పొరేట్‌లో సైనిక నైపుణ్యానికి సుప్రియ సేవలు ఉదాహరణ)