గృహ అవసరాలకు ఉపయోగించే విధంగా
ఇసుక రీచులు ఉంటే కమిటీ దృష్టికి తీసుకురావాలి
న్యూస్తెలుగు/వనపర్తి : జిల్లాలో గృహ అవసరాలకు ఉపయోగించే విధంగా మరికొన్ని ఇసుక రీచులు ఉంటే కమిటీ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలక్టర్ అధ్యక్షతన ఖనిజ నిల్వల జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్ ల అనుమతుల పై సమీక్షించారు. 2016 సంవత్సరంలో ఉక చెట్టు వాగు రీచ్ నుండి టి.ఎస్.యం. ఐ.డి సి. వారికి ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందని, గత సంవత్సరం వాగులో నీరు చేరడంతో ఇసుక తరలింపు నిలిచిపోయింది. నిలిచిపోయిన ఊక చెట్టు వాగు రీచ్ నుండి తిరిగి ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సదరు సంస్థ దరఖాస్తు చేసుకున్నదని ఏ.డి. మైన్స్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.
స్పందించిన కలక్టర్ కమిటీ సభ్యులు రీచ్ ను సంయుక్తంగా పరిశీలించి ఇసుక తీసుకునేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా కమిటీ సభ్యులను ఆదేశించారు.
అదేవిధంగా వనపర్తి జిల్లాలో గృహ నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుక తీసుకోడానికి కొత్త రీచ్ లు ఉంటే తహశీల్దార్లతో మాట్లాడి వివరాలు సేకరించాలని మైన్స్ అధికారిని ఆదేశించారు.
అదనపు కలక్టర్ రెవెన్యూ యం నగేష్ , ఏ.డి. మైన్స్ అధికారి గోవిందరాజులు, మిషన్ భగీరథ ఈ. ఈ మేఘా రెడ్డి, గ్రౌండ్ వాటర్ అధికారి మోహన్, ఇరిగేషన్ శాఖ అధికారులు, డి.పి. ఒ రమణ మూర్తి, తహసిల్దార్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.(Story : గృహ అవసరాలకు ఉపయోగించే విధంగా ఇసుక రీచులు ఉంటే కమిటీ దృష్టికి తీసుకురావాలి)