ఈ నెల 17న ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ వేడుకలు
న్యూస్‌తెలుగు/ విజయనగరం :
ఈ నెల 17వ తేదీన విజయనగరం లో ఆర్ అండ్ బీ అతిథి గృహం సమీపంలో ఉన్న ఐఎంఏ హాలులో ఉదయం 10 గంటలకు ఏపీయూ డబ్య్లూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతాయని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా అధ్యక్షుడు అల్లు సూరిబాబు స్పష్ఠం చేశారు.ఈ మేరకు నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జీఎస్ఆర్ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు పంచాది అప్పారావు,రాధాకృష్ణ,పాత్రోలు కూడా మాట్లాడారు. సిక్కోలుకు చెందిన చలపతిరావు యూనియన్ స్థాపించి తొలి మహాసభలు హైదరాబాద్ జూబ్లీ హాలులో జరిగాయని మహా పాత్రో తెలిపారు. నగరంలోని ఇండియన్ మెడికల్ హాల్ లో జరగనున్న 67 సభలకు రెండు జిల్లాల నుంచి విలేకరులంతా హాజరు కావాలని రాధాకృష్ట కోరారు.ఆ రోజు జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేంద్ర మంత్రి కే రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని జిల్లా అధ్యక్షుడు సూరిబాబు తెలిపారు.
ఈ సమావేశంలో యూనియన్ జిల్లా కార్యదర్శి ఎంఎస్ ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. (Story : ఈ నెల 17న ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ వేడుకలు)