సుందరం ఆల్టర్నేట్స్ ఇన్నోవేటివ్ ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ డెట్ స్ట్రాటజీ ప్రారంభం
న్యూస్‌తెలుగు/ముంబయి: ప్రత్యామ్నాయ పెట్టుబడులలో విశ్వసనీయమైన పేరు, సుందరం ఫైనాన్స్ గ్రూప్ అనుబంధ సంస్థ సుందరం ఆల్టర్నేట్ అసెట్స్ తాజాగా ‘ఎఫ్‌ఐఆర్‌ఎస్‌టీ (ఫస్ట్)’ పేరుతో ఒక వినూత్నమైన ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ డెట్ స్ట్రాటజీ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్)ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ‘ఎఫ్‌ఐఆర్‌ఎస్‌టీ (ఫస్ట్)’ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ రేటెడ్ షార్ట్ టర్మ్ స్ట్రాటజీ. ఇది సాంప్రదాయ ఎఫ్‌డి రేట్ల కంటే 300-400 బీపీఎస్ అధిక స్థూల రాబడిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. పోర్ట్‌ఫోలియో ప్రత్యేకంగా రేటెడ్, లిస్టెడ్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెట్టడంపై దృష్టి పెట్టడానికి రూపొందించబడిరది. సుందరం ఆల్టర్నేట్ అసెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఎం.సచ్‌దేవా మాట్లాడుతూ, సుందరం ‘ఎఫ్‌ఐఆర్‌ఎస్‌టీ (ఫస్ట్)’ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లస్ ఉత్పత్తి విశ్వసనీయతను, మా వివేచనాత్మక కస్టమర్‌ల రిస్క్-రిటర్న్ స్వీకరణను బట్టి పోర్ట్‌ఫోలియోలను అనుకూలీకరించే సౌలభ్యాన్ని మిళితం చేస్తుందని అన్నారు. (Story : సుందరం ఆల్టర్నేట్స్ ఇన్నోవేటివ్ ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ డెట్ స్ట్రాటజీ ప్రారంభం)