అనామికా ఖన్నాతో కలిసి పనిచేస్తున్న హెచ్ అండ్ ఎం
న్యూస్‌తెలుగు/ ముంబయి: హెచ్ అండ్ ఎం అనామిక ఖన్నాతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా భారతీయ డిజైనర్ సిగ్నేచర్, మన వాళ్ల సమకాలీన టైలరింగ్, విలాస వంతమైన లాంజ్ వేర్‌లు ఇప్పుడు ప్రపంచానికి సరికొత్తగా పరిచయం అవుతాయి. దీనిద్వారా మన భారతీయ వస్త్ర నైపుణ్యం, మన వస్త్రానికి ఉన్న అందం ఇప్పుడు దేశవిదేశాల్లో మరింతగా ప్రాచుర్యం పొందుతుంది. భారతదేశ వస్త్ర కళా నైపుణ్యం ఇప్పుడు అంతర్జాతీయ వినియోగదారులకు అందేలా, అర్థమయ్యేలా అనామిక ఖన్నా ప్రయత్నాలను ప్రారంభించారు. ఇందుకోసం ఆమె.. ప్రస్తుత ఫ్యాషన్‌కి అనుగుణంగా ఉన్న సంప్రదాయ సిల్ ఔట్స్‌తో పునర్మించారు. ఈ కలెక్షన్‌లో మహిళల దుస్తులు, పురుషుల దుస్తులు, ఆభరణాలు మరియు ఉపకరణాలు ఉన్నాయి. ఇవి అన్నీ త్వరలో ఎంపిక చేసిన స్టోర్లలో లాంచ్ అవుతాయి. (Story : అనామికా ఖన్నాతో కలిసి పనిచేస్తున్న హెచ్ అండ్ ఎం)