సీతం లో క్యాంపస్ టు కార్పొరేట్ కార్యశాల
న్యూస్‌తెలుగు/విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలోగల సీతం ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా మంగళవారం మెంటార్,లైఫ్ కోచ్, హెచ్. ఆర్. డి ట్రైనర్, రచయిత ఉదయ్ కుమార్ అలజంగి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సందర్భంగా ఆయన విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల యొక్క డిఫరెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో వివరించి వారికి ప్రేరణ కల్పించారు. విద్యార్థుల వికాసానికి వినికిడి నైపుణ్యాలు, స్వీయ అవగాహన ఏ విధంగా ఉపయోగపడుతుందో ఉదాహరణలతో సహా వివరించారు.అలాగే విద్యార్థులలో సామాజిక నైపుణ్యాలు, శారీరక మానసిక శక్తుల గురించి మరికొన్ని పద్ధతులతో విద్యార్థులలో అవగాహన కల్పించి ప్రోత్సహించారు.
రాండమ్ రీ కాలింగ్” పేరిట ఇద్దరు స్కూల్ విద్యార్థులను స్టేజిపై కళ్లకు గంతలు కట్టి సుమారు 20 పదాలను శ్రోతలతో చెప్పించి వాటిని చూడకుండా యాదృచ్ఛికంగా ఆఇద్దరు విద్యార్థులతో చెప్పించి మైండ్ పవర్ ఎలా ఉంటుందో తెలియజేశారు. విద్య కార్పొరేట్ ఉద్యోగాలలో ఎలా అభివృద్ధి చెంది వాటిని సాధించాలో వివరించి విద్యార్థులు సామాజిక ఒత్తిడిని ఎలా అధిగమించాలో అవగాహన పెంపొందించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు మొదటి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. (Story : సీతం లో క్యాంపస్ టు కార్పొరేట్ కార్యశాల)