వైస్ చైర్మన్ కు చిన్న చూపు
హోదామరదలుకు.బాధ్యతలు బావకు
న్యూస్‌తెలుగు/ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణంలో పాలన భిన్నంగా కొనసాగుతుంది. హోదా ఒకరికి అయితే బాధ్యతలు మరొకరు తీసుకొని పాలన కొనసాగిస్తున్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యపై వరంగల్ ఆర్డి షాహిద్ మసూద్ సోమవారం మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది. బిఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మున్సిపల్ కార్యాలయం చాంబర్లో జరిగిన చర్చలో మున్సిపల్ చైర్మన్ హాజరు కాకపోవడం, వరసకు బావ అయిన మాజీ మున్సిపల్ చైర్మన్ చర్చలు జరపడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చర్చల్లో ప్రస్తుత వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ఉన్నప్పటికీ వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా జరిగిన చర్చలపై ఆరోపణలు వస్తున్నాయి. హోదాలో ఉన్న మహిళలకు అగౌరపరచడమే లక్ష్యంగా కొందరు పురుషులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. జరిగిన చర్చల్లో మాజీ ఆధిపత్యం పై మున్సిపల్ కమిషనర్ సైతం చూసి చూడనట్లుగా వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి. (Story : వైస్ చైర్మన్ కు చిన్న చూపు )