మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి పై ప్రజావాణిలో కలెక్టర్ కి వినతి పత్రం
న్యూస్‌తెలుగు/వనపర్తి ప్రజలు కట్టిన పన్నులు జనరల్ ఫండ్ గా జామ చేస్తారు కానీ అలాంటి జనరల్ ఫండ్ త్రాగునీటి అవసరాలకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి కానీ వనపర్తి మున్సిపాలిలో జనరల్ ఫండ్ దారి మల్లుతుందని గుర్తించిన ఐక్యవేదిక జిల్లా కలెక్టర్ కి పలు అంశాలు గుర్తించిన వాటిపై ఫిర్యాదు చేయడం జరిగింది. వాటిలో ఒకటి: మిషన్ భగీరథ నీరు సరఫరా చేసే RWS లో మున్సిపల్ సిబ్బంది పనిచేయడం. ప్రజా ప్రతినిధులు కమీషనర్ ఇళ్లల్లో మున్సిపల్ సిబ్బందిని వాడుకోవడం చట్టవిరుద్దమని, రెండవది : ఆర్డబ్ల్యూఎస్ కు సంబంధించిన ఇద్దరికీ 10 లక్షలు మున్సిపాలిటీ నుండి కేటాయించడం చట్ట ప్రకారం సరైనదా. మూడవది : రామనుపాడు నుండి ప్రతిరోజూ నీరు సరఫరా అవుతున్నా ట్యాంకర్ల పేరుతో లక్షలు బిల్లులు చేసుకోవడం. నాలుగవది : లీకేజీల పేరుతో 15 ఫైనాన్స్ నుండి లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి సామాను తెప్పించి అవి ఉండగానే మళ్లీ చీటీల పేరుతో పలు షాపుల్లో సామాను తెప్పించుకున్నట్లు బిల్లులు చేసుకోవడం.
ఐదవది: ప్రతిరోజు నీరు వస్తున్నా బోర్ల పేరుతో మోటర్లు పేరుతో లక్షల లక్షలు బిల్లులు చేసుకోవడం .
R.w.s వారు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా చేస్తున్నా మున్సిపాలిటీ నుండి అధిక మొత్తంలో బిల్లులు పెట్టడం వెనక అవినీతి ఉందనేది సత్యం కనుక వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని అఖిలపక్ష ఐక్య వేదిక డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తో పాటు టిడిపి రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్, తీన్మార్ మల్లన్న సంఘం జిల్లా ప్రెసిడెంట్ విజయ్ యాదవ్, బీ.జే.వై.ఎం టౌన్ ప్రెసిడెంట్ రవి, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్, బీసీ సంఘం నాయకులు గౌనికాడి యాదయ్య, నాయకులు బోడ్డుపల్లి సతీష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.