UA-35385725-1 UA-35385725-1

భద్రాచలానికి రైలు వచ్చేస్తోంది

భద్రాచలానికి రైలు వచ్చేస్తోంది

– మల్కనగిరి- భద్రాచలం మధ్య రైలు మార్గానికి కేంద్రం వచ్చజెండా

– మొత్తం 210 కిమీ పొడవు, రూ.1.109 కోట్ల అంచనా

– భద్రాచలం గోదావరి నదిపై భారీ వంతెన

– మొత్తం 105 బ్రిడ్జీలు ఏర్పాటు

– తివినలగూడెం వద్ద రైల్వే జంక్షన్

– త్వరలో వనులు ప్రారంభం

– రామభక్తుల్లో వెల్లువిరుస్తున్న ఆనందం

న్యూస్ తెలుగు / భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలానికి రైలు మార్గం వచ్చేస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని మల్కనగిరి నుండి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు ఈ రైలు మార్గం ఏర్పాటు కానుంది. దేశవ్యాప్తంగా 8 కొత్తరైలుమార్గాలకు కేంద్రం ఆమోదం తెలపడంతో అందులో మల్గనగిరి-భద్రాచలం-పాండురంగాపురం రైలు మార్గం కూడా ఒకటి. ఈ రైలుమార్గం పూర్తయితే దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భద్రాచలం పుణ్యక్షేత్రానికి చేరేందుకు సులువైన మార్గం ఏర్పడుంది. రైలుమార్గం పూర్తయితే ఏపి, తెలంగాణ నుండి తూర్పు, ఈశాన్యరాష్ట్రాలకు రైల్వే అనుసందానం పెరగనుంది. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా సులభమవుతుంది. తద్వారా పలు పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ పెరుగుతుంది. తెలుగురాష్ట్రాల సామాజిక ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది. సుమారు 100 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గడంతో పాటు కార్భన్ దుర్ఘారాలు తగ్గుతాయి. ఇది దాదాపు కోటి మొక్కలు నాటిన దానితో సమానం.

మొత్తం 2010 కి.మీ, 4.109 కోట్ల అంచన ///- పాండురంగా పురం, భద్రాచలం మీదుగా మల్కనగిరి వరకు 2010కిలో మీటర్ల పొడవునా రైలుమార్గం ఏర్పాటు కానుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో 58 కి.మీ పొడువున ఉండనుంది. మిగతా 142 కి.మీ ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. 210 కి.మీ ఏర్పాటు చేసేందుకు సుమారు 4.109 కోట్ల అంచనాలతో ఏర్పాటు కానుంది. ఈ మొత్తంగా 17 రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఇందులో 16 క్రాసింగ్ స్టేషన్లతో పాటు,1 మెయిన్ జంక్షన్ ఉండనుంది. ఈ ప్రథానం జంక్షన్ భద్రాచలం రేల్వే స్టేషన్ (కొత్తగూడెం) – మణుగూరు రైల్వే లైను మార్గ మధ్యంలోని తివిసల గూడెం వద్ద ఏర్పాటు చేయనున్నారు. అక్కడ్నుండి పాండురంగాపురం మీదుగా సారపాక వరకు చేరుతుంది. భద్రాచలం గోదావరి నదిపై అత్యాధునిక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తారు. భద్రాచలం మీదుగా మల్కనగిరి చేరుతుంది. ఈ మార్గం మొత్తం 105 బ్రిడ్జీలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భద్రాచలం గోదావరినదిపై రాజమండ్రి తరహాలో భారీ బ్రిడ్డీ నిర్మించడంతో పాటు మరో 29 పెద్ద వంతెనలు, 74 చిన్న వంతెనలు నిర్మిస్తారు. ఈ మొత్తం మార్గంలో భద్రాచలం రాముల వారి సన్నిధిలో అత్యాధునిక ఏర్పాట్లు చేయనున్నారు.

త్వరలో పనులు ప్రారంభం ///- 1667 హెక్టార్ల భూమి అవసరం ఉండగా ఇప్పటికే పాండురంగా పురం నుండి మల్కనగరి వరకు రైల్వేలైను సర్వే పూర్తి చేశారు. ఏజెన్సీలో 1/70 చట్టం ఉండటంతో పాటు అటవీ అనుమతులు రావాల్సి ఉంది. కేంద్రం ఆమోదం తెలపకుందే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పుడు కేంద్రం పచ్చజెండా ఊపడంతో పనులు వేగవంతం కానున్నాయి. రైల్వే శాఖ అతికొద్దిరోజుల్లో డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది. డిపిఆర్ ప్రాథమిక అంచనాలను దగ్గర పెట్టుకున్న కేంద్రం ప్రభుత్వం దేశంలో కొత్త రైలుమార్గాల ఏర్పాటులో భాగంగా మల్కనగిరి నుండి భద్రాచలం వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడింది. దశాబ్దాల కాలంగా రైలుమార్గం కోసం రామభక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ రైలు మార్గం ఏర్పాటుతో దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడనుంది. దీంతో రామభక్తుల్లో ఆనందం వెల్లు విరుస్తోంది. (Story : భద్రాచలానికి రైలు వచ్చేస్తోంది)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1