సమ్మె బాట పట్టిన కార్మికులు
మిషన్ భగీరథ కార్మికులు
న్యూస్‌తెలుగు/కొమురం భీం : ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేసే మిషన్ భగీరథ కార్మికులు సమ్మె బాట పట్టారు జిల్లాలో సుమారు 250 మంది మిషన్ భగీరథ కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతినెల అందించాల్సిన వేతనం గత ఐదు నెలల నుండి రాకపోవడంతో మిషన్ భగీరథ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఐదు నెలల నుండి వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారం అవుతుందని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రేపు మాపు వేతనాలు ఖాతాలలో జమ చేస్తామని కాలం వెళ్లదీస్తున్నారు తప్ప మిషన్ భగీరథ లో పనిచేసే కార్మికుల కష్టాలను మాత్రం గుర్తించడం లేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి ఆదుకోవాలని కోరారు.ప్రతినెల 10వ తేదీలోపు కార్మికుల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు స్పందించకుంటే సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని తెలిపారు. (Story : సమ్మె బాట పట్టిన కార్మికులు)