సిగ్నేచర్ గ్లోబల్ త్రైమాసిక ఫలితాలు విడుదల
న్యూస్‌తెలుగు/న్యూఢిల్లీ : సిగ్నేచర్ గ్లోబల్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఢల్లీి-ఎన్‌సీఆర్‌లో బాగా స్థిరపడిన, భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందిన సిగ్నేచర్ గ్లోబల్ క్యూ1ఎఫ్‌వై24లో రూ. 1.7 బిలియన్లతో పోలిస్తే, ఆదాయ పరంగా 135% వృద్ధితో రూ. 4.0 బిలియన్లకు చేరుకుంది. మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 0.07 బిలియన్లుగా ఉంది. ఇదే కాలం గత సంవత్సరంలో ఇది రూ. 0.07 బిలియన్ల నష్టం నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో, కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ 255% వృద్ధితో క్యూ1 ఎఫ్‌వై25లో రూ. 31.2 బిలియన్ల ప్రీ-సేల్స్ సాధించింది. కంపెనీ నికర రుణం ఎఫ్‌వై24 చివరి నాటికి రూ. 11.6 బిలియన్లతో పోలిస్తే క్యూ1 ఎఫ్‌వై25 చివరిలో రూ. 9.8 బిలియన్లకు తగ్గింది. మొదటి త్రైమాసికంలో కంపెనీ మరో అద్భుతమైన పనితీరును నివేదించినట్లు చైర్మన్, హోల్-టైమ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ తెలిపారు. (Story : సిగ్నేచర్ గ్లోబల్ త్రైమాసిక ఫలితాలు విడుదల)