UA-35385725-1 UA-35385725-1

చీపురుగూడెం కోళ్ల ఫారం కోసమేనా పంచాయతీలపై విచారణ..?

చీపురుగూడెం కోళ్ల ఫారం కోసమేనా పంచాయతీలపై విచారణ..?

ఓ అధికారిపై విచారణ కు ఫిర్యాదు చేసిన వాళ్ళే ప్రమోషన్ ఇప్పిస్తారా..?
వ్యూహాత్మకంగా పావులు కదిపి సక్సెస్ అయిన వైసీపీ ప్రముఖ నేత

న్యూస్ తెలుగు /చాట్రాయి : చీపురుగూడెం కోళ్ల ఫారం పై ఉన్న లోకాయుక్త కేసును తప్పించడానికే పంచాయతీలపై విచారణ ప్రారంభించారా…..? విచారణలో సాధించింది ఏంటి….? చీపురుగూడెం కోళ్ల ఫారం పై లోకాయుక్తలో ఉన్న కేసు ఎత్తి వేయించడమేనా….? వైసిపి ప్రముఖ నేత మరోసారి వ్యూహాత్మకంగా పావులు కలపడం ప్రారంభించారా….? కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ , చాట్రాయి మండలంలో ఈరోజు వరకు కొత్తగా సాధించింది ఏమీలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి మారింది పాలనలో పార్టీ జెండా తప్ప పరిపాలన విధానంలో వైసీపీ ఎజెండా మాత్రం మారలేదని పలువురు అంటున్నారు. గత కొంత కాలం క్రితం వైసిపి పాలనలో చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో గ్రామపంచాయతీ అనుమతులు తీసుకోకుండా కోళ్ల ఫారం నిర్మాణం చేపట్టడంతో ఆనాటి వైయస్సార్ పార్టీ నాయకులకు కోళ్ల ఫారం నిర్మించిన యజమానికి మధ్య ఉన్న వివాదాల నేపథ్యంలో లోకాయుక్తలో కేసు నమోదు చేయించారు. జిల్లా కలెక్టర్ మొదలు సుమారు 22 రకాల అధికారులు రికార్డులు తనిఖీ చేసి గ్రామపంచాయతీ లో ఆధారాలు లేవని గుర్తించినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కలెక్టర్ ,సబ్ కలెక్టర్ ,వంటి వారు కూడా కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితిని సృష్టించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం నూజివీడు శాసనసభ్యులుగా గెలిచిన సారధి మంత్రిగా బాధ్యతలు దక్కించుకోవడం అందరికీ తెలిసిందే. చాట్రాయి మండలంలో తొలిసారిగా వచ్చింది కూడా చీపురుగూడెం కావడం గమనార్హం. మంత్రి వచ్చి చూసింది కూడా ప్రధానంగా నిచ్చెన లేని వాటర్ ట్యాంక్ డ్రైనేజీ ఇంతకు మినహా పెద్దగా చూసింది చేసింది ఏమి లేదు. మంత్రి చీపురుగూడం వచ్చే రోజు కూడా మండల అధికారులపై పెత్తనం మొత్తం చీపురుగూడెం లో ఒక వ్యక్తికి మాత్రమే అప్పగించడానికి వస్తున్నారని మండలంలోని 18 గ్రామాల్లో పెద్ద ఎత్తున వదంతులు లేచాయి. మంత్రి అటువంటి విషయాలను పెద్దగా ప్రస్తావించకపోవడంతో మిగిలిన పార్టీ కార్యకర్తలు నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. పైగా మంత్రి కార్యక్రమానికి రావాలనుకున్న వారిని కూడా మంత్రిగారు మిమ్మల్ని మా ఊరు రమ్మని చెప్పలేదంటూ ప్రచారం పెద్ద ఎత్తున జరిగిందని పలువురు చెప్పుకున్నారు. ఆ క్రమంలోనే మంత్రి సారథి కేవలం నా మాట మాత్రమే వింటున్నారని సర్వం నేనే అని సదరు వ్యక్తి ప్రోపకాండ మొదలుపెట్టడమే కాకుండా చీపురుగూడెం పంచాయతీ లో అవినీతి అక్రమాలు జరిగాయని వాటి పైన విచారణ ప్రారంభించాలని జిల్లా పంచాయతీ అధికారులను పై ఒత్తిడి తెప్పించి మొదలుపెట్టించిన విచారణ సుమారు తొమ్మిది పంచాయతీల పైకి మళ్ళించారు. దాంట్లో ప్రముఖంగా బూరుగు గూడెం పోతనపల్లి పంచాయతీలు ఉండటంతో వైసిపి ప్రముఖ నేత మంత్రి దగ్గర నేనే సర్వాంతర్యామి అని చెప్పుకునే సదరు వ్యక్తితో పూర్వం రోజుల నుండి వాళ్ల కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ స్నేహబంధాలను గుర్తు చేస్తూ కోళ్ల ఫారం పై ఉన్న కేసును తాను ఎత్తివేయి ఇస్తానని పంచాయతీలపై జరుగుతున్న విచారణను నిలిపివేయించాలని కోరినట్లు విశ్వరూయువర్గాలు కధనం దానికి అనుగుణంగానే కోళ్ల ఫారం పై ఉన్న లోకాయుక్త కేసును పెట్టినవాళ్లే ఎత్తివేసినట్లు తెలుస్తోంది. పంచాయతీల విచారణపై ఎక్కడ కదలికలు లేవు సరి కదా ఈ విచారణ జరుగుతున్న పంచాయతీలపై అధికారిగా ఉన్న ఉద్యోగిని ఒక పెద్ద భూతంలాగ ఎవరైతే చూపించారో వైసిపి ప్రముఖ నాయకుడికి జూనియర్ లీడర్ అని ఎవరైతే ప్రచారం చేశారో అదే ఉద్యోగికి విచారణ పూర్తిగా కుండా వివరాలు బయట పెట్టకుండా ఇదే చాట్రాయి మండలంలో పదోన్నతి కల్పించాలని సిఫారసు లేఖలు అదే మంత్రి సారధితో ఇప్పించడంతో ఎవరైతే విచారణకు ఆదేశాలు జారీ చేయించారో వారే పదోన్నతికి సిఫార్సు చేయడంతో వైసిపి ప్రముఖ నేత టిడిపి పాలనలో మరి ముఖ్యంగా చాట్రాయి మండలంలో మంత్రి సారథి ఎవరినైతే లక్ష్యం చేయాలనుకున్నారో అదే వైసీపీ నేతకు పరోక్షంగా సహకరించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చెవులు కోరుకుంటున్నారు. చాట్రాయి మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో పరిపాలన విధానం ఎంతగా బ్రష్టు పట్టిందో ఇటీవల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైసిపి ఎంపీటీసీలు ఎదురు తిరగడమే అద్దం పట్టింది. వైసిపి ప్రముఖ నేత టిడిపి మండల నాయకులతో కింద కూర్చుని పరస్పర ఒప్పందాలతో ఎజెండాలు తయారుచేసి పైకి పంపడంతో వైసీపీ ఎంపీటీసీలు రెచ్చిపోయారు పత్రికా కధనాలు వచ్చాయి. మండలంలో ప్రజా సమస్యలు నిర్మాణాత్మకంగా కోకొల్లలుగా ఉన్న వాటన్నిటికంటే మిన్నగా కోళ్ల ఫారం కేసుకి అధిక ప్రాధాన్యత ఇచ్చి దానినుంచి తప్పించుకోవడానికి పంచాయతీల మీద విచారణ ప్రారంభించారని రెండు మూడు రోజులు హడావుడితో దానిని కూడా మూసివేసారని పలువురు ఎద్దేవ చేస్తున్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు పారిశుద్ధ్య కార్మికులుగా నియమితులైన వారిని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి రావలసిన జీతాలు ఇచ్చే సందర్భంలో టిడిపి నియమించిన వారినీ పక్కన పెట్టి వైసిపి నాయకులు వారికి నచ్చిన నియమించుకొని కష్టపడి పనిచేసిన కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా దోచుకున్నారనే పేరుతో చనుబండ పరిశుద్ధ్య కార్మికులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఆనాటి జిల్లా పంచాయతీ అధికారి నిమ్మగడ్డ బాలాజీ స్వయంగా చనుబండ వచ్చి విచారణ చేశారు. అధికారులందరూ కూలీలకు కూలి ఇవ్వాల్సిందే అని చెప్పినప్పటికీ ఈనాటికి కూలీలకు జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవు వారిలో కొందరు ఇటీవల చనిపోయారు కూడా ఇటువంటి అంశాలను మంత్రికి చెప్పలేని నాయకులు వాళ్లే చెడ్డోళ్ళు అని చెప్పుకుంటా అదే అధికారులకు ప్రమోషన్లకు ఎలా ప్రోత్సహిస్తున్నారు. అనేది చర్చనీయాంశమయ్యింది.(Story : చీపురుగూడెం కోళ్ల ఫారం కోసమేనా పంచాయతీలపై విచారణ..?)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1