ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే
– అమాయక ఆదివాసీలపై నిర్భందాలకు స్వస్తి చెప్పాలి
– ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు
– పాల్వంచ మండలం రాజాపురంలో కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంఎల్
న్యూస్ తెలుగు /భద్రాద్రి కొత్తగూడెం : ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని కొత్తగూడెం ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం మండల పాల్వంచ మండల పరిధిలోని రాజాపురంలో ప్రపంచ ఆదివాసీదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కొమరం భీమ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ అమాయక ఆదివాసీలపై నిర్భంధాలకుస్వస్తి చెప్పాలని, అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారి పోడుభూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా అడవులను కాపాడేది, ప్రకృతి ప్రేమికులు ఆదివాసీలే అన్నారు. ప్రత్యేక జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలు కలిగున్న వారు ఈ దేశానికి మూలవాసులని, నిజాం అకృత్యాలకు గౌరెల్లా పోరాటాలు చేసిన నిజమైన విప్లవకారులన్నారు. కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ అనే నినాదాంతో అడవి బిడ్డలను ఏకం చేశారని చెప్పారు. కొత్తగూడెం కేంద్రంలో త్వరలో గిరిజన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ తహశిల్దార్ వివేక్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాధం, పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబు, మండల కార్యదర్శి వీశంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి కార్తీక్, సుధాకర్, పద్మ, నాగరాజు, ఇట్టి వెంకట్రావు, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగరపు శ్రీనివాసరావు, మన్నెం వెంకన్న, మాజీ ఎంపిటిసి మోహన్ రావు, ఎస్ కె లాల్ పాషా, జకరయ్య, వైఎస్ గిరి, బానోత్ రంజిత్, కొమరం భీమ్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యుల, ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే)