Home వార్తలు తెలంగాణ తెలంగాణలో పొగాకు టైమ్‌ బాంబ్‌

తెలంగాణలో పొగాకు టైమ్‌ బాంబ్‌

0

తెలంగాణలో పొగాకు టైమ్‌ బాంబ్‌

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: భారతదేశంలో పొగాకు వాడకం ప్రమాదకరంగా పెరుగుతుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 267 మిలియన్ల పెద్దలు లేదా మొత్తం వయోజన జనాభాలో 29% మంది పొగాకుకు బానిసలయ్యారు. గ్లోబల్‌ అడల్ట్‌ టుబాకో సర్వే (ఇండియా 2016-17 సమస్య భయంకరమైన చిత్రాన్ని ఆవిష్కరించింది. పొగలేని పొగాకు వినియోగం ప్రబలంగా ఉందని ఇది వెల్లడిరచింది. అయితే, సంక్షోభం దేశమంతటా ఏకరీతిగా లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా ప్రకారం, తెలంగాణ వంటి రాష్ట్రాలలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో 22.3% మంది పొగాకు వాడుతున్నారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ మాజీ డీన్‌, మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.శశికళ పాల్కొండ మాట్లాడుతూ , తెలంగాణలో, 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులలో 22.3% మంది పొగాకును ఉపయోగిస్తున్నారనడం గణనీయమైన ప్రజారోగ్య సమస్యను వెల్లడిస్తుందన్నారు. దేశంలో దాదాపు 267 మిలియన్ల మంది పెద్దలు పొగాకును ఉపయోగిస్తున్నందున, ప్రత్యామ్నాయ పద్ధతులు మరియు పొగాకు విరమణ విధానాలను అనుసరించటం అత్యవసరమని అన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ మోహ్సిన్‌ వలీ మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ ప్రత్యామ్నాయాలను భారతీయులు పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. (Story : తెలంగాణలో పొగాకు టైమ్‌ బాంబ్‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version