జేఎన్టీయూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
న్యూస్‌తెలుగు/విజయనగరం : జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడ విజయనగరం నందు ఎన్ ఎస్ ఎస్ విభాగం అధ్వర్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమoలో యూనివర్సిటీ వైస్ – ఛాన్సలర్ (ఇంఛార్జ్) ప్రొఫెసర్ డి. రాజ్య లక్ష్మి పాల్గోని మొక్కలను నాటి మొక్కలకు నీరు పోసారు.ఈ సందర్బంగా వైస్-ఛాన్సలర్ (ఇంఛార్జి) మాట్లాడుతు మానవుల మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటడం ఎంతైనా అవసరమని, ప్రతీ ఒక్కరు కనీసం ఒక మొక్కనైనా నాటాలన్నారు. నాటిన ప్రతీ మొక్కను కూడా పరిరక్షించవలసిన బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమoలో జెఎన్టియు – జీవి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. జయసుమ పాల్గోని మొక్కలను నాటారు. ప్రొఫెసర్ ఆర్. రాజేశ్వరరావు, అకడమిక్ ఆడిట్ డైరెక్టర్, వి. మణికుమార్, ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త, డాక్టర్.ఎ శ్రీనివాసులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, ఎస్.వేణుగోపాలరావు, యూనివర్సిటీ ఇంజనీర్, కె. శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎల్. హరిప్రకాష్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విద్యార్ధులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గోని మొక్కలు నాటారు. (Story : జేఎన్టీయూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం)