బైక్ ప్రమాదాలపై షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అవగాహన
న్యూస్‌తెలుగు/కడప: బైక్ ప్రమాదాలను నివారించడానికి కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీని డిఫ్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె.క్రిష్ణమూర్తి ప్రారంభించారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ సహకారంతో కడప సంధ్య సర్కిల్‌లో బైక్ రైడర్స్‌కు హెల్మెట్‌కు సంబంధించిన అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా బైకులను నడిపితే ప్రమాదాలు ఎలా సంభవిస్తాయో? వాటిని ఎలా నివారించాలో ప్రజలకు వివరించారు. ప్రమాదాల నివారణకు హెల్మెట్ మాత్రమే శ్రీరామ రక్ష అంటూ అందరికి తెలిసేలా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉద్యోగులు ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించ కుండా బైక్‌లు నడుపుతున్న దాదాపుగా 200 మందికి అధికారి క్రిష్ణ మూర్తితో కలిసి హెల్మెట్స్ పంపిణీ చేశారు ఎస్‌ఎస్‌ఇఎల్ ఉద్యోగులు. ఈ కార్యక్రమంలో షిరిడీ స్ధాయి ఎలక్ట్రికల్స్ సంస్ధకు సంబంధించిన ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(Story:బైక్ ప్రమాదాలపై షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అవగాహన)