UA-35385725-1 UA-35385725-1

ఆగస్టు 5న  నీటి హక్కులు కాపాడాలని  రాష్ట్రవ్యాప్త ఆందోళన

ఆగస్టు 5న  నీటి హక్కులు కాపాడాలని  రాష్ట్రవ్యాప్త ఆందోళన

ఆగస్టు 8న క్విట్ ఇండియా దినోత్సవం

సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కే ఎస్ ఎం దేశవ్యాప్త ఆందోళన

జి ఈశ్వరయ్య ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు

న్యూస్‌తెలుగు/ అమ‌రావ‌తి : బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి తెలపాలంటూ వస్తున్న కథనాలపై ప్రభుత్వం తక్షణ స్పందించి రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణకు చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన జయప్రదం చేయాలని గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణ గోదావరి నది జలాల వివాదాలపై ఏర్పాటైన బచావత్ ట్రిబ్యూనల్ కేటాయింపులకు భిన్నంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ మిగులు జలాలను కూడా లెక్కగట్టి నీటి కేటాయింపులు చేయడంపై గతంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం కూడా రాజ్యంలో భాగస్వామ్యం అయింది అన్నారు. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలపాలి అన్న ప్రశ్నకు ట్రిబ్యునల్ తీర్పు యధావిధిగా అమలు చేయాలని చెప్పిందన్నారు. తిరిగి తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఉమ్మడి రాష్ట్రానికి ప్రాజెక్టుల వారిగా కేటాయించిన నీటిని పున సమీక్షించి తెలంగాణకు ఎక్కువ నీటిని కేటాయించాలని డిమాండ్ చేసింది అన్నారు, అందుకు బిజెపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఉపసంహరణకు అంగీకరింపజేసి, తెలంగాణ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులపై పున సమీక్ష పేరుతో కొత్త వివాదానికి తెరలేపి, వివాదాస్పద బ్రిజస్ కుమార్ ట్రిబ్యునల్ కు కట్టబెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేయడమే అన్నారు. అంతకుముందే కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం కరువు పీడిత రాయలసీమ నోట్లో మట్టి కొట్టడమే అన్నారు. గోదావరి నదిపై అనుమతి లేని కాలేశ్వరం, కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ఏపీ నీటి కేటాయింపులపై వితండవాదం చేస్తుందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు మూడు రాష్ట్రాల మధ్య నడుస్తున్న నీటి వివాదాలు పరిష్కారం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తానే సమస్యగా మారిందన్నారు. జాతీయ హోదా కలిగిన పోలవరం పూర్తికి నిధులు, పెండింగ్ లో ఉన్న గాలేరు నగరి హంద్రీనీవా తెలుగు గంగా రాజోలి వెలుగొండ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కేటాయింపు, పంట కాలువల నిర్మాణం, రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న NDA కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు.

క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 9 న సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన దేశ వ్యాప్తంగా ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం, పరాయి పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం ఏ విధంగా జరిగిందో అదే స్ఫూర్తితో నేడు దేశంలో పెరిగిపోతున్న కార్పొరేట్ కంపెనీల కబంధహస్తాల నుండి వ్యవసాయాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని నినాదంతో జరుగు కార్యక్రమాలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం వి సుబ్బారెడ్డి రెడ్డి పి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. (Story : ఆగస్టు 5న  నీటి హక్కులు కాపాడాలని  రాష్ట్రవ్యాప్త ఆందోళన)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1