“యువతకు భారతీయ యువశక్తి ట్రస్ట్ సహకారం”
కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత బ్యుటిషియన్ శిక్షణ సర్టిఫికేట్ కోర్సును ఉపయోగించుకొని భవిష్యత్తులో స్వంతంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.లక్ష్మినరసింహం సూచించారు.గురువారం భారతీయ యువశక్తి ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి శిక్షణ పొందుతున్న విద్యార్థులకు బ్యాంకు రుణాలపై అవగాహన కల్పించారు.శిక్షణ పూర్తిచేసిన తరువాత నేర్చుకున్న పరిజ్ఞానాన్ని స్వయం ఉపాధి పొందడానికి ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.అందుకు సిర్పూర్ పేపర్ మిల్ సహకారంతో భారతీయ యువశక్తి ట్రస్ట్ విద్యార్థులకు కావలసిన ప్రణాళికను సూచించడంతోపాటు బ్యాంకు ఋణాలను అందించడంలో కీలక పాత్రను పోషిస్తుందని ప్రిన్సిపాల్ తెలిపారు.అదేవిధంగా భారతీయ యువశక్తి ట్రస్ట్ ప్రతినిధి శంకర్ మాట్లాడుతు విద్యార్థులకు అన్నిరకాలుగా సహకరించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారతీయ యువశక్తి ట్రస్ట్ ప్రతినిధి సభ్యురాలు శివాణి, బ్యుటిషియన్ శిక్షణ నిర్వాహకురాలు రవళి పాల్గొన్నారు (Story : “యువతకు భారతీయ యువశక్తి ట్రస్ట్ సహకారం”)