హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన యూనిటీ బ్యాంక్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: నూతన తరపు, డిజిటల్ ఫస్ట్ బ్యాంక్, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (యూనిటీ బ్యాంక్), సోమవారం ఐదు కొత్త శాఖలను ప్రారంభించడంతో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. నగరంలో పెరుగుతున్న వ్యాపార అవకాశాలపై ఆధారపడి యూనిటీ బ్యాంక్ , ఖాతాదారులకు డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను యూనిటీ బ్యాంక్ అందిస్తుంది. ఎంఎస్‌ఎంఈల కు వ్యాపార రుణాలను అందజేస్తుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు తెలివైన, వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన బ్యాంక్‌తో బ్యాంకింగ్ చేయటానికి అవకాశం కల్పిస్తుంది. నగరంలో తమ కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని గుర్తించేలా, యూనిటీ బ్యాంక్ ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్, ఎస్‌ఆర్ నగర్, మౌలాలీ, సుచిత్ర క్రాస్‌రోడ్, కూకట్‌పల్లిలో అత్యాధునిక శాఖలను ప్రారంభించింది. త్వరలో మరిన్ని శాఖలను ప్రారంభించనుంది. (Story : హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన యూనిటీ బ్యాంక్)