Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సాగునీరు విడుదల చేసిన సారధి

సాగునీరు విడుదల చేసిన సారధి

సాగునీరు విడుదల చేసిన సారధి

న్యూస్‌తెలుగు/ చాట్రాయి : తమ్ములే రిజర్వాయర్ ప్రాజెక్టు కుడి కాలం నుంచి రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మాత్యులు కొలుసు పార్థసారథి సాగునీరు విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం చాట్రాయి మండలం పోతనపల్లి పరిధిలో ఉన్న తంమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు కుడి కాల్వ నుండి సాంప్రదాయపద్ధంగా పూజలు నిర్వహించి సాగునీరు విడుదల చేశారు. అనంతరం ఇంజనీరింగ్ జిల్లా ఉన్నతాధికారులు తంమ్మిలేరు యొక్క పుట్టుపూర్వోత్తరాలను వివరించారు.ఆరున్నర కిలోమీటర్లు పొడవు ఉన్న కట్ట మూడు కాలువల ద్వారా 9169 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సుమారు 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ ప్రాంతాల్లోని బేతుపల్లి చెరువు అలుగు ,తుమ్మూరు డ్యామ్ నుంచి తమ్మిలేరుకు వర్షాకాలంలో నీరు వస్తుందని తెలిపారు. ఏలూరు ముంపు నివారణ కోసం తమ్మిలేరు నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు.
సాగునీరు సౌకర్యం పెంచే అవకాశం వుందా….?
సారది ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ. తమ్మిలేరు నీటిని ఇతర ప్రాంతాలకు సూరేపల్లి తదితర గ్రామాలకు పంపడానికి అవకాశం ఉందా ప్రాజెక్ట్ నీటి సామర్ద్యాన్ని పెంచె అవకాశం వుందా అని ప్రశ్నించారు.
అర టీఎంసీ నీటి సామర్థ్యం పెంచితే 18 గ్రామాలకు తాగునీరు ఇవ్వచ్చు…!
తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవ రెడ్డి జోక్యం చేసుకుంటూ. అర టీఎంసీ నీటి సామర్థ్యాన్ని పెంచితే పైలెట్ ప్రాజెక్టు ద్వారా 18 గ్రామాలకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయవచ్చన్నారు. గతంలో మేము ప్రతిపాదనలు చేసినప్పటికీ దివంగత మంత్రి విద్యాధరరావు కాలంలో చింతలపూడి నియోజకవర్గానికి ఎక్కువ ఉపయోగించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నారని తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో తంమ్మిలేరు ప్రాజెక్టు మూడు వంతులు భూభాగంలో ఉందని తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్ ఇ దేవప్రకాష్ డిఇ శ్రీనివాస్ ఏఈ పరమానంద తెలుగు రైతు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు జిల్లారైతు మహిళా కార్యదర్శి మాదాసు చంద్రకళ, టిడిపి మండల మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు తెలుగు రైతు నియోజకవర్గ కార్యదర్శులు పుచ్చకాయల నోబుల్ రెడ్డి చాగంటి బుచ్చిబాబు మర్లపాలెం ఉప సర్పంచ్ వెల్ది రాజా కొత్తగూడెం మాజీ సర్పంచ్ చల్లగుళ్ళ రాజారత్నం చిత్తపూరు మాజీ సర్పంచులు కొత్తపల్లి రాందాస్ దామెర చిట్టిబాబు ఆరుగొలనుపేట మాజీ సర్పంచి ఇజ్జిగాని వెంకటేశ్వరరావు చీపురుగూడెం మాజీ సర్పంచ్ ఘంట సాల మన్మధరావు పోలవరం మాజీ సర్పంచ్ ఈదర సత్యనారాయణ రాజు పోలవరం టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు ఎర్ర హేమంత్ కుమార్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు (Story : సాగునీరు విడుదల చేసిన సారధి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!