సూవెన్ ఫార్మాస్యూటికల్స్, కొహెన్స్ లైఫ్‌సైన్సెస్ విలీన ప్రక్రియలో మరో ముందడుగు
హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ కాంట్రాక్ట్ డవలప్‌మెంట్, మాన్యుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్ (సీడీఎంఓ) సంస్థల్లో ఒకటైన సూవెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ప్రతిపాదిత కొహెన్స్ లైఫ్ సైన్సెస్ విలీనానికి సంబంధించి నేషనల్ స్టాక్స్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)ల నుంచి ఆమోదాన్ని పొందింది. సూవెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, కొహెన్స్ లైఫ్ సైన్సెస్‌లు ఉమ్మడిగా ఎన్‌సీఎల్‌టీ ముందు ఒక దరఖాస్తు చేసుకున్నాయి. 12`15 మాసాల్లో ఈ విలీన ప్రక్రియ పూర్తికానున్నది. విలీనానంతరం కొత్తగా ఆవిర్భవించబోయే కంపెనీ ఫార్మా సీడీఎంఓ, ఆగ్రోకెమికల్స్ సీడీఎంఓ, యాక్టివ్ ఫార్యాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ (ఏపీఐ) మాన్యుఫాక్చరింగ్ అనే మూడు ప్రధాన అనుబంధ విభాగాలను నిర్వహిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ తన ఉత్పాదక శక్తిని మరింత పెంచుకుంటుందని, లాభాలను ఆర్జిస్తుందని ఆశిస్తోంది. (Story: సూవెన్ ఫార్మాస్యూటికల్స్, కొహెన్స్ లైఫ్‌సైన్సెస్ విలీన ప్రక్రియలో మరో ముందడుగు)