బడ్జెట్‌పై నిరసన సెగ
న్యూస్‌తెలుగు/వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండలో ఆదివారం ఉదయం ఆల్ ఇండియా కిసాన్ మహాసభ, ఏఐసీసీటీయు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కి తీవ్రమైన అన్యాయం చేశారని విభజన చేసిన ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాల సాయి సహకారాలు అందిస్తామని చెప్పి నేటి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకు దగ్గర అమరావతిని అభివృద్ధి చేయటం కోసం 15 వేల కోట్లు అప్పిస్తామని చెప్పటం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన ఆర్థిక వనరుల్ని ఇవ్వకుండా రాష్ట్రంలో ప్రధానమైనటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్ ఇంకా అనేక పరిశ్రమలకు పోలవరం నిర్వాసితులకి చెల్లించవలసిన బకాయిల గురించి ఒక్క హామీ కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని వైఎస్ఆర్సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించకుండా మనకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాన్ని రాబట్టటంలో పూర్తిగా వైఫల్యం చెందారని వారిని ప్రశ్నించడానికి కూడా సాహసం చేయలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు పాత్ర ప్రజలు గమనిస్తున్నారని తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ జనసేన అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం జరిగిందని భవిష్యత్తులో రైతు సంఘం కార్మిక సంఘాలు ప్రజాసంఘాలు కలుపుకొని ఉద్యమాల కొనసాగిస్తామని తెలియపరిచారు. అనంతరం శివయ్య స్తూపం సెంటర్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను తగలబెట్టి నిరసన తెలియపరిచారు ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు ఎస్కే ఫిరోజ్, ప్రసాద్, భాస్కర్, బుజ్జి, మాబు, రైసు సంఘం నాయకులు కామా వెంకటేశ్వర్లు, చిన్న కిష్టయ్య, అందుగులపాటి వెంకటేశ్వర్లు, ఉప్పలపాటి సుబ్బారావు, సిబ్బంది ప్రజా సంఘాల నాయకులు పిడుగు విజయకుమార్, మొదలగు వారు పాల్గొన్నారు. (Story: బడ్జెట్‌పై నిరసన సెగ)