ఇంజక్షన్ వికటించి రోగి మృతి..
న్యూస్‌తెలుగు/పల్నాడు జిల్లా, వినుకొండ:
RMP చేసిన ఇంజక్షన్ వికటించి ఓరోగి మృతి చెందాడు. నూజెండ్ల మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన తాటి శ్రీను(28) కాలుకి గడ్డ రావడంతో రవ్వవరం లొని RMP, మరియు వైసిపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మల్లికార్జున రెడ్డి వద్దకు ప్రాథమిక చికిత్స నిమిత్తం వెళ్ళాడు. RMP మల్లికార్జున రెడ్డి రోగి కాలుపై ఉన్న గడ్డకు ఆపరేషన్ చేసి గడ్డ తొలగించాడు. దీనితో రోగి కాలు వాచి తీవ్రంగా నొప్పి రావడంతో ఆ RMP నొప్పి ఇంజక్షన్ చేశాడు. దీనితో ఇంజక్షన్ వికటించి రోగి శ్రీను శరీరంపై దద్దులు, వాంతులు చేయడంతో కుటుంబ సభ్యులు వినుకొండ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఫస్ట్ ఎయిడ్ చేయాల్సిన RMP గడ్డ ఆపరేషను, ఇంజక్షన్ చేయటం వలనే శ్రీను చనిపోయాడని, ఇందుకు బాధ్యుడైన RMP మల్లికార్జున్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాదిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. (Story : ఇంజక్షన్ వికటించి రోగి మృతి..)