ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్
న్యూస్‌తెలుగు/వనపర్తి :వనపర్తి జిల్లా పెబ్బేరు గత 40 ఏళ్లుగా అంబేద్కర్ కాలనీ వాసులు వ్యవసాయం చేసుకుంటున్న గుండు బావి దగ్గర ఉన్నటువంటి పొలాలకు ఎలాంటి ఆధారాలు లేకుండా ఉండేవి… అలాంటి వాటికి మాజీ వ్యవసాయ,శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్-పర్సన్ ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్ గారు తన సొంత ఖర్చులతో దాదాపు 10 లక్షల పైగా వ్యయంలో 110 మంది రైతులకు వారు వ్యవసాయం చేసుకునే పొలాలకు పట్టాలు ఇప్పించాలనే సంకల్పంతో ముందుకు సాగి గురువారం 40 మందికి పైగా రైతులకు పట్టా పుస్తకాలు ఇప్పించి తను కాలనీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మిగతా వారికి కూడా అతి త్వరలోనే పట్టా పుస్తకాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఎద్దుల కరుణశ్రీ సాయినాథ్ మాట్లాడుతూ రాజకీయాలలో నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ మనల్ని నమ్మి అధికారం అందించిన ప్రజలకు ఎల్లప్పుడు తోడుగా ఉంటూ వారి అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చేవాడు నిజమైన నాయకుడని, గతంలో కాలనీలో మృతి చెందినటువంటి చాలామందికి గుండుబావి దగ్గర పొలాలు ఉన్న వాటికి రిజిస్ట్రేషన్లు లేక గత ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి రైతు బీమా వంటి పథకాలు వారు అందుకోలేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారని, మృతి చెందిన కాలనీవాసులను గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం నూతన పట్టాదారులు, పెద్దలు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి మాకంటూ ఎలాంటి ఆధారం లేని పొలాలను వారి సొంత ఖర్చులతో వాటిని రిజిస్ట్రేషన్లు చేపించి మాకు పట్టాలు అందించినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటామని భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ఎల్లప్పుడు మాకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో కాలనీవాసులు వసంత్ రావు ,సిద్ది రాములు ,బిష్మా , ఎద్దుల రాము ,ఎద్దుల బాలస్వామి,పెద్దలు,యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. (Story : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్)