హైదరాబాద్‌లో సైఫ్ జోన్ అధికారులతో అసోచామ్ బి2బి సమావేశాలు
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), షార్జా, యూఏఈ ప్రభుత్వం సహకారంతో, తెలంగాణా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతుతో, ఐటిసి కాకతీయ హోటల్‌లో జూలై 22-23, 2024న ‘‘యూఏఈ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీ వ్యాపారాన్ని విస్తరించడం’’ అనే శీర్షికతో బి2బి సమావేశాల శ్రేణిని విజయవంతంగా నిర్వహించింది. యూఏఈ లోని షార్జా ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఫ్రీ (సైఫ్ ) జోన్ అందించే లాభదాయకమైన అవకాశాలను అన్వేషించడానికి ఆసక్తిగా ఉన్న 85 కంటే ఎక్కువ కంపెనీల భాగస్వామ్యంతో ఈ ఈవెంట్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సమావేశాలలో యూఏఈ, ఇతర మధ్యప్రాచ్య దేశాలలో అందుబాటులో ఉన్న విభిన్న వ్యాపార, పెట్టుబడి అవకాశాలపై పరిజానం అందించటంతో పాటుగా అక్కడ వ్యాపారాలను చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, విదేశీ కంపెనీలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు గురించి వెల్లడిరచారు. అలాగే, భారతీయ కంపెనీలు తమ మార్కెట్ పరిధిని ఎలా సమర్థవంతంగా విస్తరించుకోవచ్చో నిపుణులు తెలిపారు. (Story : హైదరాబాద్‌లో సైఫ్ జోన్ అధికారులతో అసోచామ్ బి2బి సమావేశాలు)